New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…!

New Ration Cards  : తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వచ్చే మంత్రివర్గ సమావేశాలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలను చేయనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ,వాటిల్లో కేంద్ర ప్రభుత్వం 55 లక్షల కార్డులను జారీచేసిందని , అలాగే రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల కార్డులను జారీ చేసిందని తెలిపారు. అదేవిధంగా కొత్త కార్డుల కోసం పోస్టర్ ఓపెన్ చేయగా మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరా శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది.

New Ration Cards  భారీగా దరఖాస్తులు:-

అయితే తెలంగాణ రాష్టంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మీ సేవలో మాత్రం ఇప్పటికి దీనికి సంబందించిన పోస్టల్ ను ఓపెన్ చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. అనగా…ఒక కుటుంబంలో భార్యా భర్త ఇద్దరు పిల్లలు ఉంటే అందులో భార్యా భర్తల పేర్లు ఉండి పిల్లల పేరులు లేకపోతే అలాగే ఆ ఇద్దరు పిల్లలలో ఒకళ్ళ పేరు ఉన్న మరొకరి పేరుని చేర్చేందుకు కొత్త ప్రోఫార్మాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

New Ration Cards  విధి విధానాల పై కసరత్తు:-

మీ సేవలో మెంబర్ ఆడిషన్ పోస్టల్ ఓపెన్ చేసి ఉంటుంది. అయితే అందులో ఇప్పటివరకు 11 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది. ఈ విషయం పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు వచ్చే సమయంలోనే ఈ నెంబర్ అడిషన్ పై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఈ రెండు ప్రక్రియలు జరిగినట్లయితే త్వరలోనే రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలి అంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి కొత్త రేషన్ కార్డులను పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు . ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారి పై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.కావున త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీకి స్వీకారం చుట్టనుంది.