Ration Cards : కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. జారీ చేసేది అప్పుడే..!

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో చాలా అంశాలపై నాలుగు గంటల పాలు చర్చించారు. అందులో ప్రధానంగా ధాన్యం కొనుగోలుపై చర్చించారు.

కోడ్ ముగియగానే..

సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు జూన్ 2న తెలంగాణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చించారు. అంతే కాకుండా ఈ సమావేశం తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల కోడ్ ముగియగానే పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని వారందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై క్లారిటీ ఇచ్చారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

అంతే కాకుండా కొత్త పిన్షన్లు కూడా ఇస్తామన్నారు. దాంతో పాటు ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీలు చేస్తామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన ఆరుగ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అందుకే పేదలు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. వారి ఆశలను నెరవేరుస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.అంతే కాకుండా రాబోయే వర్షాకాలం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటామని తెలిపారు.