Thati Kallu : తాటి కల్లు, ఈత కల్లు తాగేవారు.. బాడీలో హీట్‌ ఉన్నవారు ఇది అస్సలు మిస్‌ అవ్వొద్దు..!

Thati Kallu : వేసవి వచ్చిందంటే చాలు.. మనకు అనేక రకాల సీజనల్‌ పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఇవి విరివిగా లభిస్తుంటాయి. ప్రస్తుతం వీటిని నగరాలు, పట్టణాల్లోనూ రహదారుల పక్కన విక్రయిస్తున్నారు. అయితే తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ముంజల్లో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం తగ్గుతుంది. ముఖ్యంగా షుగర్‌ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.

షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. తాటి ముంజల్లో బి విటమిన్లతోపాటు విటమిన్‌ సి, ఐరన్‌, జింక్‌, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అనేక వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. తాటి ముంజలు చర్మానికి ఎంతో సంరక్షణను అందిస్తాయి. తాటి ముంజలపై ఉండే పొరను చెమట పొక్కులపై రాయడం వల్ల అవి తగ్గుతాయి. చర్మం చల్లగా మారుతుంది. వేడి నుంచి రక్షణ లభిస్తుంది. చర్మంపై వచ్చే దురద, దద్దుర్లు కూడా తగ్గుతాయి. అలాగే తాటి ముంజలతో ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకుని కూడా వాడవచ్చు. ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది. మృదువుగా మారుస్తుంది. తేమగా ఉంచుతుంది. తాటి ముంజలు జీర్ణ సమస్యలను సైతం తగ్గించగలవు.

కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్‌, మలబద్దకం తగ్గుతాయి. అయితే అతిగా తింటే మాత్రం విరేచనాలు కలుగుతాయి. కనుక ముంజలను మోతాదులో తినాలి. ఇక వేసవిలో చాలా మంది తాటి కల్లు తాగుతుంటారు. కానీ దీన్ని ఉదయం 6 గంటల లోపు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని నీరా రూపంలో తాగితేనే మనకు మేలు జరుగుతుందట. అలా కాకుండా కల్లు తీసిన తరువాత ఆలస్యం అయ్యాక తాగితే పులుపు పెరుగుతుంది. అలాంటి కల్లును తాగితే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. అయితే కల్లు పులుపు ఎక్కకుండా తియ్యగా ఉండాలంటే దాన్ని తీయగానే ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో తాజాగా ఉంటుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరాను తాగవచ్చు. దీంతో వేసవిలో ఎంతో మేలు జరుగుతుంది.