TTE And TC : రైళ్ల‌లో TTE కి TC కి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..? పేరు ఒకేలా ఉన్నా ఈ ఇద్ద‌రి ప‌ని వేరే అని తెలుసా..?

TTE And TC : సాధార‌ణంగా చాలా మంది దూర‌ప్ర‌యాణాలు చేసేవారు రైళ్ల‌లోనే వెళ్తుంటారు. కేవ‌లం స్థోమ‌త ఉన్న‌వారు మాత్ర‌మే విమానాల్లో ప్ర‌యాణం చేస్తారు. గంట‌ల త‌ర‌బ‌డి బస్సుల్లో ప్ర‌యాణం చేయాల‌న్నా ఇబ్బందే. క‌నుక చాలా మంది రైళ్ల‌లో వెళ్లేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. రైళ్ల‌లో అయితే బ‌స్సుల్లో క‌న్నా త‌క్కువ ఛార్జి అవుతుంది. అందుక‌నే ట్రెయిన్ జ‌ర్నీనే ఎక్కువ చేస్తుంటారు. అయితే రైళ్లో మీరు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు టీసీ వ‌స్తుంటాడు క‌దా. ఈ క్ర‌మంలోనే కొన్ని సంద‌ర్భాల్లో మనం వారి బ్యాడ్జిల మీద టీటీఈ లేదా టీసీ అని చూస్తుంటాం.

ఈ రెండు ప‌దాలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ క‌న్‌ఫ్యూజ్ చేస్తాయి. అయితే వాస్త‌వానికి రెండూ ఒకేలా ఉన్నా ఈ ఇద్ద‌రు చేసే ప‌ని వేరుగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టీటీఈ అంటే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామిన‌ర్‌. అంటే ఈయ‌న ట్రెయిన్‌లో ఎక్కి మ‌నం ప్ర‌యాణంలో ఉండ‌గా మ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌న ద‌గ్గ‌ర టిక్కెట్లు ఉన్నాయా, లేదా, స‌రైన ట్రెయిన్‌కి స‌రైన రిజ‌ర్వేష‌న్‌తోనే టిక్కెట్ తీసుకున్నామా, మ‌న ఐడీ కార్డు, ఇత‌ర వివ‌రాల‌ను చెక్ చేస్తాడు. ఇక టీసీ అంటే ఏమిటో కూడా చూద్దాం. టీసీ అంటే టిక్కెట్ క‌లెక్ట‌ర్ అని అంటారు.

మ‌నం రైళ్లలో ప్ర‌యాణించేట‌ప్పుడు కేవ‌లం టీటీఈ మాత్ర‌మే మన టిక్కెట్ల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. టీసీకి ఆ అధికారం ఉండ‌దు. రైల్వే ప్లాట్‌ఫామ్‌, చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లో టీసీ మ‌న టిక్కెట్ల‌ను ప‌రిశీలిస్తాడు. అంతేకానీ టీసీ రైళ్లలో మ‌న టిక్కెట్ల‌ను త‌నిఖీ చేయ‌లేడు. క‌నుక ఇక‌పై ట్రెయిన్ల‌లో మీ టిక్కెట్ల‌ను త‌నిఖీ చేసేవారు టీటీఈ అయి ఉండాలి అన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి. టీసీలు రైళ్ల‌లో టిక్కెట్ల‌ను చెక్ చేయ‌లేరు. ప్లాట్‌ఫామ్‌పై, స్టేష‌న్ ప‌రిస‌రాల్లో చెక్ చేయ‌గ‌ల‌రు.