Ugadi Pachadi : ఉగాది పచ్చడి తినకపోతే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీరు మిస్ అయినట్టే…

Ugadi Pachadi : హిందూ సాంప్రదాయంలో ఉగాదిని ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఉగాది అంటే ఉగాది పచ్చడి దీని స్పెషల్. ఇది షడ్రుచుల సమ్మేళనం. ఒగరు, పులుపు, తీపి, కారం, చేదు అనే ఆరు రుచులు కలిసేదే ఉగాది పచ్చడి అంటారు. మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే రకంగా ఆహ్వానించాలని ఒక సందేహాన్ని ఈ ఉగాది పచ్చడి అందిస్తుంది.ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి చింతపండు, వేప పువ్వు, మామిడికాయలు, మిరపకాయలు, ఉప్పు, బెల్లం దీనిలో వాడుతారు. వాడే ఒక్కొక్క రుచికి ఒక అర్థం ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ఏ రుచికి ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం…

బెల్లం తీపి: బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగానే ఉంటాయి. కావున ఆయుర్వేదంలో చాలా మందులలో బెల్లం వాడుతుంటారు. బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉండడం వలన గర్భిణీ స్త్రీలు బెల్లం తింటే రక్త ప్రసరణ బాగా జరిగి శరీరానికి అద్భుతమైన ఇనుము అందేలా చేస్తుంది.

ఉప్పు: ఉప్పు మానసిక శారీరిక రుగ్మతులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉప్పు మెద శక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ మెదడు పనితీరు బాగుండాలని ఈ కాలంలో డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలన్న ఉప్పు తప్పనిసరిగా తీసుకోవాలి. బ్యాక్టీరియాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. జీర్ణశయం శరీరం శుభ్రం అవుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి.

వేప చేదు: వేపలు రోగనిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఋతువులలో వచ్చే మార్పుల కారణంగా పిల్లలకు సోకే కలరా, మలేరియా, ఆటలమ్మ నిరోధకంగా ఉపయోగపడుతుంది. గుమ్మానికి వేపాకులు కట్టడం వలన స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. వేపాకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం దీనిలో ఉంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

మామిడికాయ ఒగరు: మామిడికాయలు పులుపు తీపి తో పాటు ఒకరు గుణం కూడా ఉంటుంది. చర్మం నిగారింపు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. విపరీతమైన చలి తర్వాత వేడి వల్ల పెదాలు పగలడాన్ని మామిడిపండు లోని ఒగరు గుణం తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

పచ్చిమిర్చి కారం: పచ్చిమిర్చిలోని కారం గుణం తలనొప్పి కండరాలు నరాల నొప్పులను తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ముఖంపై మొటిమలు తగ్గించేందుకు యాంటీబయాటిక్ గా పనిచేయడమే కాకుండా అధిక వేడికి చక్కని ఔషధంలా ఉపయోగపడుతుంది.

చింతపండు పులుపు: మామిడి ముక్కలు చింతపండు ,పులుసు కలిసి మన ఆలోచన శక్తి పరిధిని మరింతగా పెంచుతాయి. దీని వలన మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. చింతపండులోని పులుపు వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. చింతపండు మనలోని చింతను దూరం చేసి మానసిక ఆరోగ్య బారిన పడకుండా రక్షిస్తుంది..