అబ్దుల్లాపూర్‌మెట్‌ నవీన్‌ కేసులో ట్విస్ట్‌.. సూసైడ్‌ చేసుకుంటానంటూ హరిహర గర్ల్‌ ఫ్రెండ్‌ వార్నింగ్‌!

అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ దారుణ హత్యతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలక్కిపడింది. ప్రేమించిన యువతి కోసం హరిహరకృష్ణ తన స్నేహితుడిని నమ్మించి దారుణంగా హతమార్చాడు. అయితే ఇంతటి భయంకర దారుణంలో హరిహరృష్ణ మాత్రమే ఉన్నాడా.. ఇంకా ఎవరైనా అతడికి సాయం చేశారా అన్న యాంగిల్‌లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఊహించని షాక్‌ తగిలింది. ఆ వివరాలు.. తాను ప్రేమించిన అమ్మాయికి దగ్గర అవుతున్నాడు అనే కారణంతో స్నేహితుడిని నమ్మించి అతి కిరాతంగా హత్య చేసిన అబ్దుల్లాపూర్‌మెట్‌  ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. నిందితుడి హరిహరకృష్ణ, తన స్నేహితుడు నవీన్‌ని హత్య చేసిన తీరు చూసి పోలీసులే భయపడ్డారు.

నవీన్‌ను హత్య చేసి.. ఆపై అతడి శరీర భాగాలను వేరు చేయడమే కాక.. వాటితో సెల్ఫీలు దిగి.. వాటిని తన గర్ల్‌ ఫ్రెండ్‌, మరి కొందరు స్నేహితులకు సెండ్‌ చేశాడు హరిహరకృష్ణ. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలక్కిపడింది. అసలు మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది.. యువతలో ఈ నేర ప్రవృత్తి ఏంటి అంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయానికి హరిహరకృష్ణ స్నేహితుడిని అత్యంత దారుణంగా అంతమొందించాడు. ప్రస్తుతం పోలీసులు హరిహరకృష్ణను అరెస్ట్‌ చేశారు. ఇక రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అమ్మాయి.. నవీన్‌కు దగ్గర అవుతుందనే అనుమానంతో..

ప్రాణ స్నేహితున్ని అతికిరాతంగా చంపాడు నిందింతుడు హరిహరకృష్ణ. అయితే.. ఈ కేసులో కేవలం హరిహరకృష్ణ ఒక్కడు మాత్రమే భాగమా.. లేక అతడికి ఇంకెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక హరిహరకృష్ణ తండ్రి కూడా.. తన కొడుకు చేసింది నూటికి నూరు శాతం తప్పే అని ఒప్పుకోవడమే కాక.. నవీన్‌ కుటుంబానికి క్షమాపణలు తెలుపుతూనే.. ఇతంటి దారుణం తన కుమారుడు ఒక్కడే చేసి ఉండడని.. దీని వెనుక ఉన్న మిగతావాళ్లను కూడ బయటికి తీసుకురావాలని కోరాడు. ప్రస్తుతం పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నవీన్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ.. దీని గురించి ఎవరెవరికి చెప్పాడో తెలుసుకుని..

వాళ్లను విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. నవీన్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ.. మృతుడి శరీర భాగాలను ఓ బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లి బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న తన స్నేహితుడు హసన్ గదికి వెళ్లాడు. నవీన్‌ను హత్య చేసినట్లు.. హసన్‌కు తెలిపారు. ఆ మరుసటి రోజున నవీన్‌ హత్య గురించి తన ప్రియురాలికి కూడా చెప్పాడు. అంతేకాక నవీన్‌ను హత్య చేసిన తర్వాత.. అతడి శరీర భాగాలను కట్ చేసి.. ఒక్కొక్కటిగా ఫొటోలు తీస్తూ తన ప్రియురాలికి పంపించాడు నిందితుడు హరిహరకృష్ణ. ‘‘ఈ వేళ్లే కదా నిన్ను తాకింది’’ అంటూ చేతి వేళ్లను.. ‘‘ఈ పెదాలే కదా నిన్ను తాకింది’’ అని పెదాలను..

‘‘ఈ గుండెనే కదా నిన్ను ప్రేమించింది’’.. అంటూ ఆయా శరీర భాగాలన్నింటిని నవీన్‌ బాడీ నుంచి వేరు చేసి.. వాటన్నింటినీ ఫొటోలు తీసి తన ప్రియురాలికి వాట్సప్‌లో పంపించాడు. అయితే.. వాటన్నింటినీ చూసిన ఆ ప్రియురాలు ఏమనుకుందో తెలియదు కానీ.. ఓకే, గుడ్ బాయ్ అంటూ.. సింపుల్‌గా రిప్లై ఇచ్చి ఊరుకుంది. పైగా హరిహరకృష్ణ.. నవీన్‌ హత్య గురించి ఆమెకు చెప్పిన తర్వాత కూడా.. నవీన్ ఫ్రెండ్ ఫోన్ చేసి.. హరిహరకృష్ణ వివరాలడిగితే సదరు యువతి తనకు ఏమాత్రం తెలియనట్టుగానే మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే.. ఈ పరిణామాలను చూస్తే.. ఈ క్రైంలో ప్రియురాలి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. హరిహర తండ్రి కూడా ఆ అమ్మాయి పాత్ర ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు కూడా సదరు యువతిని విచారించాలని భావించారు.

కానీ.. ఆమె మాత్రం ఏకంగా పోలీసులకే ఊహించని షాక్‌ ఇచ్చింది. పోలీసులు నవీన్‌ హత్య గురించి సదరు యువతని ప్రశ్నించగా.. తనకేం తెలియదని.. ఇందులోకి తనను లాగొద్దని.. ఒకవేళ బలవంతంగా తనను విచారిస్తే.. సూసైడ్ చేసుకుంటానంటూ.. వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక నవీన్‌ హత్యకు మూడు నెలల ముందే ప్లాన్‌ రెడీ చేసుకుని.. స్నేహితుడిని అంతమొందించిన హరిహరకృష్ణ.. పోలీసులకు లొంగిపోయే ముందే తెలివిగా తన ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేసి ఫోన్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ కేసులో మరి కొందరు కూడా భాగం అయ్యుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాక హరిహరకృష్ణకు ప్రియురాలికి మధ్య జరిగిన సంభాషణ, చాటింగ్‌ కోసం డేటాని విశ్లేషిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.