కల్తీ ఐస్ క్రీమ్స్ గుర్తించటం ఎలా వీడియో మీకోసం..!!

Ice Cream : సమాజంలో ప్రస్తుతం డబ్బులు సంపాదించడానికి ఏది పడితే అది చేసేస్తున్నారు. ఏదో రకంగా డబ్బు సంపాదించే ఆలోచనలో మనిషి ఉన్నాడు. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు.. మన జేబుల్లోకి డబ్బులు వచ్చేయాలి. దీంతో బయట చాలావరకు మార్కెట్ కల్తీ అయిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో… ఐస్ క్రీమ్స్ భారీ ఎత్తున అమ్ముతూ ఉంటారు.

అయితే వీటిలో కల్తీ.. మరియు నాణ్యత కలిగిన ఐస్ క్రీమ్స్ గుర్తించటం దానిపై ఓ అవగాహన వీడియో.. మీ ఆరోగ్యం కోసం. చాలా ప్రాంతాలలో రకరకాల డేంజరస్ కెమికల్ ఉపయోగించి ఐస్ క్రీమ్ పైకి ఆకర్షితంగా కనిపించిన గాని దాన్ని ఆస్వాదించి.. తినే వ్యక్తి యొక్క శరీరం లోపల అనేక డామేజ్ లు చేస్తూ ఉండే పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఈ రకంగా ఐస్ క్రీమ్ తిని అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇదే సమయంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి పోలీసులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ లకి కొంతమంది వ్యాపారులు దొరికిపోతున్నారు. అయితే ఈ కల్తీ అయిన ఫుడ్ ఐటమ్స్ గుర్తించడం వంటి విషయాలపై.. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇంటర్వ్యూ వీడియోలో అనేక విషయాలు ప్రజారోగ్యం గురించి మీకోసం. ఈ వీడియోలో కల్తీ అయిన ఐస్ క్రీమ్స్ ఇంకా వాటిలో ఉపయోగించే ప్రమాదకరమైన పదార్థాలు అవి మనిషి శరీరంలో హాని చేసే విధానం అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది.