కాలికి నల్ల దారం ఏ రాశి వారికి కలసి వస్తుంది? ఏ రాశి వారికి అరిష్టమో తెలుసా

కాలికి నల్ల దారం కట్టుకోవడం వలన ఏ రాశి వారికి కలిసివస్తుంది, ఏ రాశి వారు కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల అరిష్ట కాలాన్నిఅనుభవిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.. నల్ల తాడు అనేది చాలా మంది కట్టుకుంటూ ఉంటారు, కానీ ఎవరు కట్టుకోవచ్చు, ఎవరు కట్టుకోకూడదు అనేది మనకు తెలియదు. ప్రస్తుత కాలంలో చాలా మంది కాలికి నల్ల దారం కట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇలా కట్టడం వల్ల మనకు ఎలాంటి ప్రభావాలు, చెడు శక్తులు మనపై పనిచేయవు. అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఇది ఒక ఫ్యాషన్ గా కూడా అయిపోయింది. అని చెప్పుకోవచ్చు.పాత రోజుల్లో అయితే నల్లదారం అనేది నరదృష్టి, నరఘోష అనేది తగలకుండా పిల్లలకు కడుతూ ఉంటే, వారు తర్వాత పెద్దవాళ్ళు కూడా కట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. కొందరు ఇది ఒక సాధారణ మైనటువంటి నల్ల దారం, కాలికి కట్టుకుంటే మరి కొంత మంది వివిధ రకాలైనటువంటి చక్కగా జరుగుతుంది, పూసలను చక్కగా జోడించుకొని, ఇది కాళ్లకు కట్టుకోవడం జరుగుతోంది. కానీ నల్లదారం అనేది ప్రతి ఒక్కరికీ సరిపడుతుంది.

అంటే ఎవరైనా కట్టుకోవచ్చు అనేది మాత్రం కరెక్టు కాదు, అని చెప్పి అనుకోవచ్చు.ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఎవరూ కూడా ఈ నల్ల దారాన్ని ప్రతి ఒక్కరు ధరించవచ్చు అని ఎక్కడా కూడా చెప్పలేదు. కొన్ని రాశుల వారికి మాత్రమే ఈ నల్ల తాడుని కట్టడం ద్వారా శుభం జరుగుతుందని, మరి కొంతమందిలో ఈ ఒక్క నల్లదారం అశుభాన్ని కలగచేస్తుంది. అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. మరి ఏ రాశి వారు ఈ ఒక్క నల్ల దారాన్ని ధరించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుతున్నారు. ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను చూద్దాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే మనకు నల్ల తాడును కొన్ని రాశుల వారు మాత్రమే ధరించాల్సి ఉంటుంది, వారికి మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నల్ల తాడు ను కేవలం ధనస్సు, తుల, కుంభ రాశి వారు మాత్రమే ధరించాలి. వీరికి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అనేది ఇవ్వడమే కాకుండా, చాలా మేలు చేస్తుంది. ఈ నల్ల తాడు అనేది ఈ రాశిచక్రాల లో పుట్టిన వారు ఎటువంటి సంకోచం లేకుండా నిరభ్యంతరంగా ధరించవచ్చు. ఈ క్రమంలో వృశ్చిక రాశి, మేష రాశిలో జన్మించిన వారికి ఈ నల్ల తాడు అనేది కలిసిరాదు.

नज़र का काला धागा बनाने का आसान तरीका Design No.1 Indian Feet - YouTube

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి, మేష రాశి ఇవి రెండూ కూడా అంగారకుని యొక్క ఆధీనంలో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రాశుల వారు నల్ల తాడు ని అస్సలు ధరించకూడదు. ఈ రాశుల వారు నల్ల తాడు ని ధరిస్తే వీరికి ఎప్పుడూ అశుభాలు, మనశ్శాంతి లేకపోవడం, ఆందోళన ఇక చికాకులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది.నల్ల దారాన్ని ధరించేటప్పుడు చాలా మంది వారి ఇష్టానుసారంగా ధరిస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క నల్ల తాడు ని ధరించేటప్పుడు మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తాడే కథా కట్టించుకోవడం అనుకోకండి మంచి సమయాన్ని మంచి ముహూర్తం చూసి దరించుకోవాలి. ఈ నల్ల తాడు ధరించేటప్పుడు ముందుగా చేయవలసింది ఏమిటి అంటే, రుద్ర గాయత్రి మంత్రాన్ని పఠించాలి .ఈ విధంగా గాయత్రీ మంత్రం చదివిన తర్వాతే ఈ దారాన్ని తొడగాలి. అయితే మనం చేతికి ఇంతకు ముందు కనుక పసుపు లేదా ఎరుపు రంగు దారాలు ఉంటే, ఈ యొక్క నలుపు దారాన్ని మనం కట్టుకోవలసిన అవసరం ఉండదు అనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే నల్ల దారం కాలికి ధరించేవారు శనివారం రోజున ధరిస్తే కనుక చాలా చక్కటి అయినటువంటి, అత్యుత్తమమైన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. శనివారం ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు, శనికి నలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజు నలుపు దారాన్ని ధరిస్తూ, రుద్ర గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక ఈ తాడుకి మరింత బలం చేకూరి అన్ని శుభాలను కలగ చేస్తుంది.