కిడ్నీలో స్టో న్స్ తగ్గించే జ్యూస్..

కిడ్నీలో స్టోన్స్, మూత్రపిండాలలో రాళ్ళు, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, అని ఇలా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉండే వాళ్ళు, లక్షల్లో, కోట్లలో ఉన్నారు. దీని కోసం చాలామంది ఆపరేషన్లు చేయించుకోవటం, ఈ నొప్పి ఉన్నట్టుండి వచ్చేస్తే ఏం చేయాలో తెలియక, వైద్యుల దగ్గరికి వెళ్తే, ఆపరేషన్ చేయాలంటే, చేయించుకోవడం తర్వాత బాధ పడటం ఎన్నో ఉంటున్నాయి. కాని మనకు ప్రకృతి అందించిన చాలా అద్భుతమైనది ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించుకొని కిడ్నీ స్టోన్స్ అనేవి లేకుండా చేసుకోవచ్చు..అసలు రాకుండా చూసుకోవచ్చు.ముందు ఈ యొక్క మూత్రపిండాలలో రాళ్ళు ఎందుకు వస్తాయి? అనేది మీరు తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా క్యాల్షియం కంటెంట్స్ కానీ, ఈ యొక్క ఆక్సిడేషన్ జరిగేవి అంటే ఆమ్ల పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకున్నప్పుడు, మనం సరిపడా నీళ్లు తాగకపోతే, అది కిడ్నీలు సక్రమంగా ఫిల్టర్ కాకపోవడం వల్ల, అక్కడ అవి ఎంజైమ్స్ కలయికతో క్రిస్టల్ ఫామ్ గా తయారై పోతాయి. అది మనకి 2 mm నుంచి 5 mm, 20 mm నుంచి 40 mm ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. మరి పెద్దగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్జరీ చేయించు కోవాల్సి వస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో వారానికి ఒకసారో, రెండుసార్లో ఈలోపల స్టోన్స్ లాంటిది కలిగించగల గుణం కలిగిన ఆమ్లా పదార్థాలతో ఇలాంటివి తయారు అవుతాయి. కాబట్టి క్షార గుణం కలిగిన వాటిని మనం తీసుకోవడం ద్వారా వాటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా అవి కరిగి పోతుంటాయి.ఈ కిడ్నీ స్టోన్స్ లో కానీ, లేదా గాలి బ్లాడర్ స్టోన్స్ ఆహార పదార్థాల లోపాల వల్లే వస్తాయి. ఆహారం తీసుకోవడం అది సక్రమంగా జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ ఎక్కువైపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇలాంటివి ఎక్కువ అయిపోవడం దానితోపాటు, నీరు సరఫరా తాగకపోవడం, మోషన్ సరిగా వెళ్లకపోవడం అంటే మలబద్దక సమస్య ఉండడం వీటితోనే కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి.

కిడ్నీ స్టోన్స్ అనేవి లేవు అనుకోండి, కానీ మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం వారానికి ఒక్కసారైనా ఇప్పుడు నేను చెప్పేవి చూసి, నీరు తాగుతున్నట్లు అయితే మీకు కిడ్నీ స్టోన్స్ తయారుకావు.తయారై ఉన్న కూడా చిన్న, చిన్నవైతే వెళ్లిపోతాయి/ పెద్దవి అనుకోండి మీరు రోజూ తాగుతూ ఉండడం ద్వారా 40 రోజులకు, 60 రోజులకు అవి కరిగిపోతాయి. అది ఎంత పెద్ద గా ఉన్నా సరే. మనకు ప్రధానంగా ముల్లంగి, ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ, ఉలవలు, ఈ నాలుగు చాలు. మనకు కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్ కరిగించడానికి, రాకుండా చేయడానికి. మీకు ఒకవేళ సడన్ గా ఎప్పుడైనా నొప్పి వచ్చింది అనుకోండి, పెద్దది ఉందని తెలిసింది అనుకోండి, అప్పటికప్పుడు తాత్కాలికంగా మీరు ఏదైనా చికిత్స తీసుకుని, తర్వాత నేను చెప్పిన రోజు ఒక అరకప్పు అయినా తాగండి. అంతే మీకు చాలు. మీకు వేరే చేయవలసిన పనిలేదు. తిన్న తర్వాత తాగొచ్చు, తినక ముందు తాగవచ్చు. టీ, కాఫీ లాగా తాగొచ్చు.

ఒక రోజు, రెండు రోజులు అలవాటు చేసుకుంటే మీకే అలవాటు అయిపోతుంది.ముల్లంగి గడ్డలు, రెండవది ఉల్లిపాయ, తర్వాత వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క. ఈ నాలుగింటిని మనం జ్యూస్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిని కొద్దిగా త్రికటు చూర్ణం అంటే మిరియాలు, సొంటి, పిప్పళ్ళు. మిరియాలు అంటే అది అజీర్ణం కాకుండా మనకు బాగా జీర్ణం చేయడానికి రెండవది కొద్దిగా ఉప్పు, టేస్ట్ కొంచెం కారం గా అనిపిస్తుంది కానీ అలవాటు చేసుకుంటే మనకు అలవాటైపోతుంది. ఒకవేళ ఎంత కారామా అనుకునేవాళ్ళు ఒకవేళ ఇంత కారగా తాగలేము అనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు కలుపుకుని తాగవచ్చు. వీటన్నింటినీ కలిపి మిక్సీ కి వేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చు.దీనిని రోజుకు ఒక్కసారి తాగితే చాలు. వారంలో రెండు లేదా మూడు రోజులు తాగితే చాలు. మీకు మే కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ జ్యూస్ లో కొద్దిగా త్రికటు చూర్ణం కలపాలి. అంటే సొంటి, పిప్పళ్లు మిరియాల పొడిని కలపాలి. తర్వాత కొద్దిగా సైంధవ లవణాన్ని అంటే ఉప్పు కలపాలి. కిడ్నీ స్టోన్స్ రాకుండా, వచ్చినవి పోవడానికి ఈ జ్యూస్ ని తయారు చేసుకుని తాగండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి.