ఆడవారిలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తలు కలవండి వెంటనే గర్భం వస్తుంది

ఈరోజు మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి, చాలామంది లేడీస్ కి ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ కోసం వచ్చేటప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తారు, అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి, దీనికి హాస్పిటల్ కి ఎన్ని సార్లు వెళ్లాలి, దీన్ని ఎందుకు చేస్తారు, దీని చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేది ఎంత వరకు ఉంటుంది ఉంది అనే డౌట్స్ కూడా ఉంటాయి, అయితే మనం వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటో తెలుసుకుందాం, ఇది మనం ఫాలికిల్స్ ని స్టడీ చేస్తాం, అంటే పీరియడ్స్ టైం లో ఏ టైంలో ఫాలికిల్స్ ఏ షేప్ లో ఉంటాయని ఇందులో స్టడీ చేస్తారు, ఇది ఎందుకు చేస్తారంటే ఓవిలేషన్ ట్రాక్ చేయడానికి,ఓవిలేషన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఎగ్ బ్యాక్ నుండి ఎగ్ రిలీజ్ అయ్యే రోజును ఓవిలేషన్ అని అంటారు. సాధారణంగా ఈ ఓవిలేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎగ్ అనేది బ్యాగ్ నుండి విడుదల అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి.

అంటే ఆ టైం లో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి, కొందరు రీసెంట్లీ మ్యారేజ్ అయినవారు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు, వాళ్లు కూడా ఓవిలేషన్ టైంలో రిలేషన్ లో లేకపోతే వాళ్లకి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అయితే ఈ ఓవిలేషన్ ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవడానికి స్కాన్ అనేది ఉంటుంది, దీనిలో మొదటగా ఆ లేడీ లో ఎగ్స్ కౌంట్ అనేది సరిగ్గా ఉందా అని చెక్ చేయడానికి పీరియడ్స్ లో రెండవ రోజున పిలుస్తారు, మామూలుగా ఎగ్ బ్యాగ్స్ రెండువైపులా ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఉంటాయి, మామూలుగా ఎగ్స్ అనేవి సిక్స్ టు సెవెన్ వరకు ఉంటాయి, కొంతమందికి 12 అలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల డే టు స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. గర్భాశయం లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా ఈ పీరియడ్స్ రెండవ రోజున చెక్ చేస్తారు.

తర్వాత లేడీస్ ని ఎనిమిదవ రోజు మళ్ళీ ఒకసారి చెకప్ కోసం పిలుస్తారు, ఎనిమిదవ రోజు ఎందుకు పిలుస్తారు అంటే ఫాలికిల్స్ అనేవి రెండవ రోజు10 ఎం ఎం కన్నా తక్కువ ఉంటాయి, ఎనిమిదవ రోజు కు వచ్చేసరికి 14 ఎం ఎం వరకు అవుతుంది, అంటే ఫాలికిల్ అనేది ఎవ్రీ డే పెరుగుతుంది. ఎగ్ సైజ్ పెరిగితే వారికి మెడిసిన్ ఏమి అవసరం లేకుండా నాచురల్ గానే పెరుగుతుంది అని చెప్తారు, అలాగే మళ్ళీ 10 వ రోజున 18 ఎం ఎం వరకు ఉంటుంది, అలాగే కొంతమంది లో 12వ రోజు వరకు 22 వరకు ఉంటుంది దీన్ని మంచి మెచ్యూర్ ఎగ్ అంటారు, ఇలాంటి టైంలో రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ వస్తాయని చెప్తారు. తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని స్కాన్ చేస్తే తెలుస్తుంది.