రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ …

మీడియా చెప్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగాలు గొప్ప వ్యక్తులను గుర్తించని పరిస్థితి దేశంలో ఉంది. మహనీయుడు మట్టిలో మాణిక్యం హరేకల హజబ్బా గురించి BBC 2012 లోనే అతని గొప్పతనాన్ని గురించి చెప్పింది. కానీ పద్మశ్రీ అవార్డు రావడానికి అతనికి ఇన్నేళ్లు పట్టింది. సంగీతం, ఆటలు ,పాటలు పాడే వారికి కూడా భారత రత్న ఇచ్చి గౌరవించుకుంటున్నాం. కానీ వారందరి కంటే గొప్ప వ్యక్తి ఈ హరే కల హజబ్బా. దేశ భవిష్యత్తుకు సమాజంలో పిల్లలను గొప్పగా తీర్చిదిద్దేందుకు కూలి పని చేసి జీవితాన్ని అంకితం చేశారు. నాయకులు జనం సొమ్ము దోచుకుని ఆస్తులు కూడా పెడతారు కానీ పండ్లు అమ్ముకునే హజబ్బా ఏకంగా పిల్లలకు బడి కట్టించారు. ఇంతటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకో నైనా పాలకులు ,అధికారులు మంచి బుద్ధి పొందుతారని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకో బోయేది ఓ సరస్వతి పుత్రుడు గొప్ప జీవిత కథ.

హరే కళ హజబ్బాది కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని న్యూడప్ గ్రామం. ఇంకా చెప్పాలంటే బెంగుళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హజబ్బా నివసించే గ్రామం. ఆయన నిరుపేద కానీ మంచి మనసుతో ఆయన అపర కుబేరుడు. మంగుళూరు వీధుల్లో ఒక బుట్టలో బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. రోజుకు 150 రూపాయల లాభం ఉండేది, దాంట్లోనే కొంత ఆయన దాచేవారు,కుటుంబాన్ని పోషించుకునేవారు హజబ్బా. ఈయనకు చదువు రాదు ఆ రోజుల్లోనే తమ గ్రామంలో కూడా స్కూల్ లేకపోవడంతో ఎంతో మంది విద్యకు దూరమయ్యారు. చిన్న ఊరు అని కనీసం పాఠశాల కూడా కనిపించలేదు ప్రభుత్వం. అవన్నీ మరిచిపోయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజున మంగళూరు వీధిలో ఇద్దరూ విదేశీయులు అజంతా దగ్గరికి వచ్చి పండ్లు ఎంత అని ఇంగ్లీషులో అడిగారు, కన్నడలో సమాధానం చెప్పారు హజబ్బా.

వాళ్లు పదేపదే ఇంగ్లీష్ లో అడుగుతున్నారు వాళ్లు అడిగింది తనకు అర్థం కాలేదు, తాను చెప్పింది వారికి అర్థం కాలేదు, చివరకు ఆ జంట చిరాకుతో వెళ్ళిపోయింది. అప్పుడే ఆయన మనసు చిబుక్కుమంది, అక్షరం విలువ ఆయనకు తెలుసు కాని దాని బాధ మొదటిసారి గుండెను తాకింది. తాను చదువుకోకపోవడం వల్ల కనీసం పండ్లు కూడా అమ్ముకోలేక పోయాను మరి నా బిడ్డలు నా ఊరి పిల్లలు భవిష్యత్తులో పండ్లు కూడా అమ్ముకోవడానికి పనికిరాని వారు అవుతారని భయపడ్డారు ఆయన. దీంతో ప్రతి రోజు 150 రూపాయలను వెనకే సారు, ఇలా దాదాపుగా 1990 నుండి పండ్లు అమ్మి తన ఖర్చులు పోగా కొంత డబ్బును దాచాడు. రూపాయి రూపాయి గా తన శ్రమను దాచిపెట్టారు ఆ డబ్బులతో తమ గ్రామంలో మంచివాడిని నిర్మించాలి అనుకున్నాడు.

దాదాపుగా పది వేలు సేకరించిన తర్వాత ఊరి శివారులో భూమి ఉంటానని ఒక వ్యక్తిని సంప్రదించాడు. నేను పదివేల రూపాయలు ఇస్తాను మంచి బడి కడతాను నాకు మీ భూమి అమ్మండి మన ఊరి పిల్లలు మన పక్క ఊరి పిల్లలు చదివేందుకు పాఠశాల కట్టిస్తాను అని చెప్పాడు ఆయన. ఆ మాటలు విని భూమి యజమాని నవ్వాడు, పండ్లుమురీగిపోతే నువ్వే తింటావు నీకెందుకు అని వెటకారం ఆడాడు, దాంతో కోప్పడ్డ హజబ్బా భూమి అమ్ముతావా లేదా చెప్పమని నిలదీశాడు, 20 వేలకు ఇస్తానని చెప్పాడు ఆయన. 1990లో తక్కువ రేట్లు ఉండడంతో తన కోసం భూమి కొనకుండా మరో 10,000 అప్పు చేసి ఎకరం నర కు పైగా భూమిని కొన్నాడు ఆయన. ఆ భూమిని ఊరి పాఠశాల కోసం అనే గ్రామంలో అందరికీ చెప్పేవాడు కానీ తన మాట ఎవరు వినేవారు కాదు వెటకారం చేసేవారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…