ఇక మీకు గుండె జబ్బు లైఫ్ లో రాకుండా ఇది ఇది చేస్తుంది

మనిషికి కొత్త కొత్త విషయాలను కనుక్కోవడం చాలా గొప్ప విషయం. అయితే ఇలా కొత్త విషయాలను కనుగొనడంలో ప్రకృతి మనకు అందించిన వనరులను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు మనుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యలు జంతువులలో అసలు కనిపించవు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మైదా , స్వీట్లు అధికంగా తీసుకునే మనిషిలో ఎక్కువ గుండెజబ్బులు కనిపిస్తాయి. జంతువులలో ఈ సమస్యలు ఎందుకు ఉండవు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే జంతువులు ప్రకృతి ఇచ్చిన పండ్లు, ఆకులు, గడ్డి వంటి సహజ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి.

ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు మాంసాహారం అధికంగా తీసుకోవడం వాటిలో మనం చూడలేం. ఎన్ని తరాలు మారినా వాటి పరిణామ క్రమం మారింది కానీ ఆహారపుటలవాట్లు ఎప్పటికీ మారలేదు. జంక్ ఫుడ్, మైదా లాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో కొవ్వు పేరుకొని గుండె రక్తనాళాలకు అడ్డుగా ఏర్పడతాయి. ఇవి గుండె జబ్బులకు, అధిక బరువు, కార్డియోవాస్క్యులర్ సమస్యలకు కారణమవుతాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. జంతువులు తమకు ఎంత కావాలో అంత మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి. అధికంగా ఆహారాన్ని తీసుకోవు. ఇలా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మనిషి సర్వ రోగాలు వస్తున్నాయి.

ఉప్పు, కారం అధికంగా తీసుకునే వారిలో రక్తపోటు సమస్య అధికమై అది మెదడు పనితీరును, గుండె రక్త నాళాలను దెబ్బ తీస్తుంది. మనం తీసుకునే ఆహారం మన శరీరంలో అవయవాలు నష్టపరిచి మన ఆరోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. సహజంగా దొరికే పండ్లు, కాయలు, డ్రై నట్స్ వంటివి తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సాయంత్రం ఆరు, ఏడు గంటల్లోపు ఆహారాన్ని తీసుకునే వారిలో జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తుంది. మనిషికి ఎన్ని తెలివితేటలు ఉన్నా జంతువుల నుండి తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఇదే మన చుట్టూ ఉండే ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతి మనకు అందించిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి.