ఈచిన్న ముక్క రోజు తింటే…

ఈరోజు మనం మన వంటింట్లో ప్రతినిత్యం వాడుకునేటటువంటి ముఖ్యమైన వస్తువు గురించి తెలుసుకుందాం అదే బెల్లం. బెల్లాన్ని మనం ఎలా మెడిసినల్ గా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా బెల్లాన్ని అన్ని పిండి వంటల్లోనూ ఉపయోగిస్తారు అలాగే టీ పెట్టుకోడానికి కూడా బెల్లాన్ని ఉపయోగిస్తారు ఇది ఒకప్పటి సాంప్రదాయం కానీ ఇప్పుడు బెల్లం స్థానంలో చక్కర వచ్చేసింది. ఎనీమియా తగ్గడానికి బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, స్త్రీలలో ఎనీమియా ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాo, గైనిక్ ప్రాబ్లం వల్ల కానీ తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా డైజేషన్ అవ్వక పోషకాహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఐరన్ డెఫిషియెన్సీ అనేది ఏర్పడుతుంది, ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి ఎనీమియా అనేది తప్పనిసరిగా వస్తుంది కాబట్టే ఎనీమియా ప్రాబ్లం ఉన్నవారికి బెల్లం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

అందుకని మీరు ఇంట్లో ఎలాంటి స్వీట్ చేసుకున్నా సరే వాటిలో బెల్లాన్ని మాత్రమే ఉపయోగించండి. ఎనిమియా లేదా రక్తహీనత అనేది స్త్రీలల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే పోస్ట్ డెలివరీ వాళ్ళ లో కూడా టీనేజ్ అమ్మాయిలలో కూడా రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటివారు వంటల్లో చక్కెరకు బదులు ఉపయోగించండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. బెల్లం అనేది మన బాడీలో యాక్టివిటీనీ కూడా కరెక్ట్ చేస్తుంది, మన బాడీలో మనం ఆహారం తీసుకున్న తర్వాత అది డైజేషన్ అయ్యి మన శరీరంలో ఎన్నో జీవక్రియలకు ఆ సమయంలో ఈ బెల్లం తీసుకోవడం వల్ల మనలో మెటబాలిక్ ఆక్టివిటీ కూడా కరెక్ట్ గా ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటుగా బాడీలో ఉన్నటువంటి మిగిలినటువంటి జీవ క్రియలు కూడా సరిగ్గా జరగడం వల్ల ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అలాగే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం చూస్తూ ఉంటాం కదా పొట్టంతా గ్యాస్ పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు .

అలాంటి వారు ఈ బెల్లం ముక్కను భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఆ గ్యాస్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది తర్వాత వారికి అజీర్ణ సమస్య కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం లో కూడా మనకు ఆర్గానిక్ బెల్లం అనేది స్పెషల్ గా దొరుకుతుంది, మామూలుగా బెల్లం తయారు చేసేటప్పుడు అందులో యూరియా, అమ్మోనియా కు సంబంధించినవి అన్ని కెమికల్స్ వేసి తయారు చేయడం వల్ల బెల్లం అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది ఇలాంటి బెల్లము అనేది ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది దానికంటే కూడా కొంచెం కలర్ తక్కువ అయినా కూడా ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అదేవిధంగా ఈ రోజుల్లో తాటి బెల్లం కూడా దొరుకుతుంది, తాటి బెల్లం కూడా ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుందని చెప్తున్నారు మీకు అవకాశం ఉన్నట్లయితే తాటి బెల్లాన్ని కూడా మీరు ట్రై చేయవచ్చు.