ఈ ఆకు చాలు పూర్వం జుట్టు రాలకుండ ఇదే వేడేవారు జుట్టు బైబర్చంగా పెరుగుతుంది …

హెయిర్ ఫాల్.. ఇప్పుడు అందరికీ ఇది కామన్ ప్రాబ్లెమ్. తలపై ఉండే నాలుగు వెంట్రుకులు.. చూస్తుండగానే రాలిపోతుంటే ఎవరైనా బాధ ఉండకుండా ఎలా ఉంటారు? ఇందుకోసమే మనలో చాలా మంది హెయిర్ ఫాల్ ని నివారించడానికి చాలా కష్టపడుతుంటారు. మార్కెట్ లో ఉన్న అన్నీ రకాల ఆయిల్స్ ని ఈ పాటికే వాడేసిన వారు కూడా లేకపోలేదు. నిజం చెప్పాలంటే వీటి ద్వారా అంతగా ప్రయోజనం ఉండదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. కాకుంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి.. రకరకాల ఆయిల్స్ కోసం వేలకి వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ..,

ఇలాంటి విషయాల్లో ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చేది మాత్రం ఔషధ గుణాలుండే మొక్కలే. అలాంటి వాటిలో రోజ్ మేరీ చెట్టు సంజీవని అని చెప్పుకోవచ్చు. రోజ్ మేరీ చెట్టు ఆకులు జుట్టు రాలడాన్ని సంపూర్ణంగా నివారించగలవు. ఇదేమి పెద్ద సీక్రెట్ కూడా కాదు. మన పెద్దలకి ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల విలువ పూర్తిగా తెలుసు. కాస్మొటిక్స్ మాయలో పడ్డ ఈ జనరేషన్ ఇలాంటి అద్భుతమైన నిజాలను తెలుసుకోకపోవడం వల్లే సమస్యకి సమాధానం దొరకడం లేదు.జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ముందుగా రోజ్ మేరీ ఆకుల నుండి నూనెని తాయారు చేసుకుంటే చాలు. ఈ రసాన్ని రాసుకొంటే ముందుగా జుట్టు పెరుగుదల కనిపిస్తోంది. పైగా..,

ఇది ముందుగా చుండ్రుని సమర్థంగా తగ్గిస్తోంది. చుండ్రు సమస్య తగ్గి, కేశాలకి బలం చేకూరడంతో 90 శాతం వరకు హెయిర్ ఫాల్ అక్కడే తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకు రసాన్నీ రాత్రిపూట తలకు పూసుకొని మర్ద‌న చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే అద్భుత ఫలితాన్ని అందుకోవచ్చు. ఇక స్కాల్ఫ్ దురదగా ఉండే వారికి, తలలో ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి రోజ్ మేరీ మాయిశ్చరైజ్ సంజీవనిలా పని చేస్తోంది. ఇక ఈ రోజ్ మేరీ ప్లాంట్ ఉపయోగాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి.