తక్కువ పెట్టుబడితో లక్షలు కురిపిస్తున్న పంట.. కిలో 800 చొప్పున కొంటుంది ఈ కంపెనీ..

తీవ్రమైన వ్యాధులను నివారించేందుకు  ఔషధ మొక్కల మార్కెటింగ్ వేగంగా విస్తరించింది. కరోనా కష్టకాలంలో సహజ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరిగింది. చాలా మంది భారతీయులు ఇంటి చిట్కాలను ఉపయోగించి వైరస్ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకున్నారు. మార్కెట్‌లో ఔషధ మొక్కలతో తయారైన ఉత్పత్తులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది.  ఔషధ మొక్కలను ప్రస్తుతం ఆయుర్వేద మరియు సిద్ధ ఔషధాలలో బాగా ఉపయోగిస్తున్నారు.  గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లా రైతులు ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు.

ఇక్కడి రైతులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలికల పంటతో కాసులు పండిస్తున్నారు. దాంగ్‌ జిల్లాలో రైతులు తెలుపు మస్లీ మూలికల పంటలు పండిస్తున్నారు. దీన్నే సఫేద్ మస్లీ అని కూడా అంటారు. వర్షాకాలంలో చేపట్టే ఈ మూలిక సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ మూలికల సాగు చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే పంటను సాధిస్తున్నారు. 

 వైట్ మస్లీ మూలికలు అధిక బరువు తగ్గేందుకు, అంగ స్తంభన సమస్యలకు, డయాబెటిస్ అదుపులో ఉంచుకునేందుకు బాగా పనిచేస్తుంది. దీనికి ఇండియాతోపాటూ విదేశాల్లోనూ డిమాండ్ ఉండగా మూలికలతో పాటు టానిక్ రూపంలో కూడా లభిస్తుంది.ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకు తుండగా ప్రభుత్వ పథకాలను పొందడంతో సాగు ఖర్చు చాలా స్వల్పంగానే ఉంటోంది.   స్థానిక ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారు.  ప్రభుత్వ సాయం కూడా కలిసిరావడంతో ఈ పంట రైతుల ఇంట సిరుల పంట కురిపిస్తోంది.