ఈ చిట్కా పాటిస్తే ఎంతటి గారపట్టిన పసుపు పచ్చ పళ్ళైనా తెల్లగా మారుతాయి.

అందమైన,ఆకట్టుకునే రూపం కోసం చర్మం మెరుపుతో పాటు పంటి వరుస కూడా అంతే ముఖ్యం.కానీ చాలామంది వక్కపొడి, గుట్కాలు నమలడం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన పళ్ళపై మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించడానికి దంతవైద్యులతో చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.అవి కొంచెం ఖరీదైనవి.తక్కువ ఖర్చుతో పళ్ళను తెల్లగా మార్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ముఖానికి అందం వస్తుంది. కానీ చాలామందికి ఎక్కువగా ఉండే సమస్య చూడడానికి చాలా అందంగా ఉన్నా, పళ్ళు మాత్రం పసుపుపచ్చగా మారి చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి.నలుగురిలో నవ్వాలన్నా, మాట్లాడాలన్న కూడా ఇలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

వీటిని తొలగించడం కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు మనం మామూలుగా వాడే టూత్ పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. మనం రోజూ పళ్ళు తోమడానికి ఎంత పేస్ట్ అయితే వాడతామో అంత మొత్తం చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో అరస్పూన్ ఉప్పు, అరస్పూన్ పసుపు వేసుకోవాలి. అందులో అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే నాలుగు వెల్లుల్లి దంచి వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈపేస్ట్ ను కూడా గిన్నెలో వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమంతో పళ్ళు తోమడం వలన పళ్ళు తెల్లగా అందంగా మారుతాయి.ఈమిశ్రమంలో అన్ని సహజ పదార్థాలు వాడడంవలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పళ్లపై ఉండే మరకలను తొలగించడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిస్తాయి.ఇందులో వేసిన ఉప్పు నోట్లోని బ్యాక్టీరియా క్రిములను తగ్గించడంతో పాటు పళ్ళు తెల్లగా అందంగా మారుతాయి.పసుపు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాల పుచ్చు మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.ఇందులో వాడే నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండి పళ్లను తెల్లగా చేయడంలో ఉపయోగపడుతుంది.ఇందులో వేసిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ బ్యాక్టీరియాను తొలగించి పంటినొప్పి,పళ్ళపై ఏర్పడే మరకల నుండి ఉపశమనం కలిగిస్తుంది..