ఈ చిన్న తప్పే ప్రాణం తీసింది 30-40 వయసు ఉన్న వాళ్ళు తప్పకుండ ఈ వీడియో చూడండి ..

డాక్టర్ సుధాకర్ గుండెపోటు గురించి తెలియజేస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు మన తాతల కాలంలో ఈ గుండెపోటు వచ్చేదని కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మన అలవాట్లు , ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా మూడు పదుల వయసులో కూడా వస్తుందని ఆయన తెలిపారు. జన్యు పరమైన కారణంగా కూడా గుండె పోటు రావచ్చు.

మనిషి చలనం లేకుండా పడిపోయి ఉండటం కార్డియాక్ అరెస్ట్ అవడం చూస్తూనే ఉన్నాం. తారక రత్న విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని అడుగగా.. తారక రత్న మాసివ్ గుండెపోటు. గుండె లోపల రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అక్కడ ఏదైనా క్లాత్ అయితే రక్తప్రసరణ జరగడం ఆగిపోతుంది. సాధారణ ప్రజలను కూడా గుండె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారం ఏ టైంలో పడితే ఆ టైంలో అస్సలు తినకూడదు దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. డైట్ అనేది ఎప్పుడూ ఎక్కువగా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్డును తక్కువగా తీసుకోవాలి. పిజ్జా, బర్గర్ తింటే కడుపు నిండుతుంది కానీ పోషకాహారం తీసుకోవాలి. స్ట్రెస్ అనేది కామన్. మనం ప్రతి దానికి గాబరా పడకుండా స్ట్రెస్ తగ్గించుకుని ఉండేలా చూసుకోవాలి.