తెల్లవారుజామున 5 గంటలకి మీకు కలలో ఇవి వస్తున్నాయా..అయితే మీరు కోటీశ్వరులే…

మానవుల్లో కొన్ని ముఖ్యమైన సమస్యల్లో కల అనేది ఒకటి, కల అనేది ఒక వైకల్యం, కొన్నిసార్లు ఇవి సంకేతాలను కూడా ఇస్తాయి, సహజంగా మనకు భగవంతుడు కొన్ని కలల రూపంలో కూడా ఇస్తాడు అయితే కోటీశ్వరుడు అయ్యే ముందు ఎలాంటి కలలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!మనిషి జీవితంలో సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూఉంటారు, కొందరికి భయంకరమైన కలలు వస్తే, మరికొందరికీ మంచి మంచి కలలు వస్తూ ఉంటాయి, కలలకి కూడా ఎన్నో విశేషాలు మరియు ప్రత్యేకమైన శాస్త్రాలు కూడా ఉన్నాయి, ప్రతి కల కి ఏదో ఒక అర్థం తప్పక ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

కొంతమందికి ఏదైనా చెడు జరిగే ముందు అది ముందుగానే కలలో సంకేతంగా కనిపిస్తుంది, అయితే కోటీశ్వరులు అయ్యా ముందు ఎలాంటి కలలు వస్తాయి అంటే, దేవుళ్ళు లేదా వారి విగ్రహాలు, పఠాలు, గుళ్లు కలలో కనిపిస్తే ఎవరికీ చెప్పకూడదు అని పండితులు చెబుతున్నారు, ఎందుకంటే దేవతలు మీ పూజలకు ప్రసన్న మయ్యారని అర్థం, మీకు త్వరలోనే అష్టైశ్వర్యాలు కలుగుతాయని దీనికి సంకేతం. అలాగే మీ ఇంట్లోనే చిన్నపిల్లలకి కలలో ఎప్పుడైనా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా కల వస్తే ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి ఇచ్చిన సంకేతమే, లక్ష్మీదేవి ఇంట్లో కొలువుదీరినట్లు ఒక సంకేతం అలాగే జమ్మి చెట్టు కలలో కనిపిస్తే సమస్త విజయాలను పొందుతారు, రాజకీయాలలో ఉన్న వారికి కలలో జమ్మి చెట్టు కనిపిస్తే వాళ్ళు తప్పకుండా పదవులను వరిస్తారూ.

సముద్రం ,నది ,నీళ్ళు పారే సెలయేరు, ఇలాంటివి కలలోకి వస్తే మీ అదృష్టం పండినట్లే త్వరలో మీ ఇంట్లో సుఖసంతోషాలు పొందుతారు అని అర్థం, పదేపదే నీటిని చూడడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అర్థం, అలాగే ఏనుగులు కూడా కలలో కనిపిస్తే వారు ఉన్నతమైన ఉద్యోగాలకి, ఉన్నతమైన స్థానాలను చేరుతారని అర్థం, పారుతున్న నీటిలో తమనుతాము నీటి లో చూసుకుని నీళ్లు తాగుతున్నట్లు కల వస్తే మీ జీవితం సంతోషంగా మారబోతున్న అని అర్థం, కొంతమందికి కలలో తెల్ల గుర్రాలు కూడా కనిపిస్తాయి, గుర్రం కలలో పరుగెత్తుతున్నట్లు కనిపించిన నీకు విదేశ ప్రయాణం కలుగుతుందని సంకేతం, కలలో చెట్టు నిండా కాయలతో ఏ చెట్టు కనిపించిన మీ జీవితంపండపోతుంది అని అర్థం. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ ఇది ముగింపు, ఎంతో శుభ విషయాలు జరగబోయే ముందు ఇలాంటివి కనిపిస్తాయట, కలలో ఉదయిస్తున్న సూర్యుడు కనిపించినట్లయితే ఇక మీరు మీ పూర్తి జీవితమంతా సంతోషంగా ఉంటారని అర్థం.