ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివితే దెబ్బకి పిల్లల జాతకం మారిపోతుంది…

పిల్లలకు సంబంధించి వాళ్లకి కాస్త ఒంట్లో బాగా లేకపోయినా లేదా సరిగ్గా చదువుకోవాలి అన్న లేదా పిల్లలు భయపడుతున్న రకరకాల మంత్రాలు హనుమాన్ చాలీసా వంటివి నేర్పిస్తూ ఉంటారు, అలాగే బాగా చదువుకోవాలి అంటే దానికి సంబంధించిన విధివిధానాలు జపించాల్సిన మంత్రాలు ఉంటాయి. అదేవిధంగా జీవితంలో ముందుకు సాగాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా సాఫీగా జరగాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా వీటికి సంబంధించి ప్రత్యేకించి ఏమైనా మంత్రాలు కాని శ్లోకాలు కానీ ఉన్నాయా అని విషయం పై మనం మాట్లాడుకుందాం.

మంత్రాలు అనుష్టానాలు అనేది చాలామంది చేయలేరు, మంత్రాలు అనగానే వాటికి ఒక విధివిధానాలు నియమాలు ఉంటాయి, అలాగే గురువు దగ్గర నుండి ఉపదేశాలు అంటివి ఉంటాయి కానీ మనం ఇవన్నీ చేయలేక పోతాం అందువలన మనం తేలికగా శుక్లాంబరధరం వంటి శ్లోకాలు నేర్పిస్తాము అలాగే ఆంజనేయ స్వామి దండకం నేర్పిస్తాము, వినాయకుడికి సంబంధించి కొన్ని శ్లోకాలను నేర్పిస్తాము. అయితే తల్లులు చేసేందుకు ఒక మంచి ప్రక్రియ ఉంది, ఇది ఒక ప్రత్యేకమైన విధి విధానం, మామూలుగా సాధారణంగా మనం రామాయణాన్ని ఆదికావ్యంగా చెప్పుకుంటాము అలాగే వాల్మీకి ఆదికవిగా చెప్పుకుంటాము, మానవ జీవితానికి వరపడి సీత రాములు.

రాముడే మనకి అత్యున్నతమైన పద్ధతిలో అనుసరించాల్సిన వాడు, అంటే ప్రతి విషయం కూడా అతనిని చూసి నేర్చుకోవాలి, ఆయన ఒక అన్నయ్యగా మంచి ఆదర్శవంతుడు అలాగే కొడుకుగా, భర్తగా, ఒక రాజుగా మంచి ఆదర్శవంతుడు. అందువల్ల రామాయణం అనేది ఆదికావ్యం మరియు మనకి పరమ పవిత్రమైన గ్రంథంగా చెప్పబడింది. అయితే ఈ రామాయణం నుండి కొన్ని శ్లోకాలను మనం చదువుకోవచ్చు దీనికి గురు ఉపదేశం అవసరం లేదు, దీనికి పెద్దగా నియమాలు కూడా ఏమీ లేవు, రామాయణంలో ఒక ప్రత్యేకమైన ఘట్టంలో సీతాదేవి చెప్పిన ఒక నాలుగు ప్రత్యేకమైన స్లోకాలు చాలా అనుసరణీయమైనవి, ఆచరణీయమైనవి,అలాగే ఇది చాలా సులువు.

ఈ శ్లోకం అనేది సుందరకాండలో 53వ సర్గలో ఉంది, 28 ,29 ,30 ,31. ఇవి ఈ నాలుగు శ్లోకాలు. ఇవి ఏ సందర్భంలో సీత అమ్మవారు చెప్పారో తెలుసుకుందాం. సుందరకాండలో సీతా అన్వేషణ సమయంలో రాముడు తదితరులు సీత అన్వేషణ కోసం బయలుదేరారు. ఇలా సీతాదేవిని వెతకడానికి నాలుగు వైపులా బయలుదేరి ఒక సమూహం ఆంజనేయస్వామి, అంగదుడు, జాంబవంతుడు కలిసి ఉన్న సమూహం సముద్ర తీరం వైపు వెళ్ళింది. అక్కడ వాళ్లకి సంపాతి అనే గద్ద వల్ల జటాయు యొక్క అన్నయ్య ఆయనవల్ల సీతను తీసుకువెళ్ళింది ఎవరో తెలుసుకున్నారు. అప్పుడు ఆ సమయంలో జాంబవంతుడు మనందరి కంటే ఎక్కువ శక్తి శాలి, ధైర్యశాలి ఆంజనేయుడు అని చెప్పి ఆంజనేయుని లంకకి పంపిస్తారు.

ఇదంతా కూడా మనకు కిష్కింధకాండలో ఉంటుంది, అదే సుందరకాండలో అయితే ఆంజనేయుడు తన శక్తిని అంతా గుర్తుకు తెచ్చుకొని అక్కడి నుండి ఎగిరి లంకా నగరానికి ప్రవేశం చేస్తాడు. ఆంజనేయ ఆంజనేయులు యొక్క తెలివితేటలు శక్తి అంతా కూడా మనకు సుందరకాండలో తెలుస్తుంది. ఆ విధంగా ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతాదేవిని చూస్తాడు, తర్వాత ఆ లంకకి రాజు ఎవరో తెలుసుకోవడం కోసం అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, ఇలా ఆంజనేయునికి లంకాధిపతి కి మధ్య జరిగిన యుద్ధంలో ఆంజనేయులు తోకకి నిప్పంటిస్తారు, అప్పుడు ఆంజనేయుడు ఊరుకోక తన తోకతో లంకకి మొత్తం నిప్పంటించాడు.

ఎప్పుడైతే ఆంజనేయుని తోకకి నిప్పంటించారు అని సీతమ్మకి తెలిసిందో వెంటనే అగ్నిదేవుని ప్రార్థించింది. ఇది సుందరకాండలో 53వ సర్గలో ఉంది. ఇలా రామాయణంలో ఈ నాలుగు శ్లోకాలని తల్లులు కనుక చెప్పినట్లయితే ప్రత్యేకంగా కుమారులకు అని చెప్పబడింది కానీ సంతానం కోసం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పిల్లల భవిష్యత్తు పట్ల వారు ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఏదైనా ప్రమాదాలు ఎదురవుతాయి అనే భయం ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు పట్ల మనకు భయాలు ఉండి జాతకాలలో ఇబ్బందులు ఉన్నాయని లేదంటే అవకాశాలు రావట్లేదని భయపడే వారు ఈ శ్లోకాలను అలవాటు చేసుకోండి, వీటిని ఎన్నిసార్లు చదవాలి అని నియమం ఏమీ లేదు, ఇలా రోజువారిగా మనం చదువుకునే శ్లోకాలలో ఈ నాలుగు శ్లోకాలను చదువుకోండి.