ఈ 4 రకాల కూరల ఫ్రై లు తిన్నారో నేరుగా విషయం తిన్నాట్లే……. మీరు ఈ తప్పు చేయకండి

నూనె ను వంటల్లో వాడుకోవడానికి కనిపెట్టక పూర్వం మట్టి పాత్రలలో, రాతీ పాత్రలలో వంటలు చేసుకునేవారు. ఎప్పుడైనా స్నాక్స్ వంటివి చేసుకోవాలి అనుకుంటే నూనె లేకుండా కాల్చుకొని చేసుకునేవాళ్ళు. నిధానంగా నూనె ఎప్పుడైతే తయారు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ముందు పిండివంటలను నూనెలో వండుకునే వాళ్ళు. ఇతర రోజుల్లో మాత్రం కూరలు నూనె లేకుండానే వండేవారు. ఎప్పుడైనా ఉపయోగిస్తే ఒక హఫ్ స్పూన్ అలా ఉపయోగించేవారు. తాలింపుకు మాత్రమే వాడే వారు. పూర్వం రోజుల్లో అలా ఉండేది.

కూరగాయలు మాత్రం నూనెలో వెయించే సాంప్రదాయం ఎప్పుడూ లేదు. అది ఈ మధ్య కాలంలోనే మొదలైంది.15,20 ఏళ్ల నుంచి కూరగాయలు కూడా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా వెపాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది. మరియు మాడి పోకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అదే నూనెలో వేసి వేపితే ఐదారు నిమిషాలలో అయిపోతుంది. దానిపైన కారం, మసాలాలు చల్లుకోవడమే. అందువలన ఈ రోజుల్లో చాలా మంది బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, కాలీఫ్లవర్ 65, వంకాయ ఫ్రై, ముఖ్యంగా బంగాళా దుంప ఫ్రై నూనెలో వేసి వేయించేస్తున్నారు. దీనివలన చాలా చాలా ప్రమాదాలు శరీరంలో జరుగుతాయి. ఇవి తినడానికి బాగున్నా ఆరోగ్యం దెబ్బతింటాయి.

ఈ నూనెలో దేవినవి ఏవైనా 250-260 డిగ్రీల వేడి లో వేగుతు ఉంటాయి. దీనివలన కూరగాయల్లో ఉండే మొత్తం పోషకాలు పోతాయి. లాభం సున్న. నూనె వల్ల లాభం లేకపోయినా పరవాలేదు గానీ నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నూనెలో పదార్థాలు వేసి వేపడం వలన అందులో పదార్థం ఏమీ ఉండదు. కాబట్టి అందులో హానికలిగించే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. మరియు ఫ్యాట్ కూడా ట్రాన్స్ ఫ్యాట్ గా మారిపోతుంది. ప్రోటీన్ కూడా దెబ్బతింటుంది. నూనె వలన అన్ని డ్యామేజ్ అవుతాయి. మనం కూరలు ఆరోగ్యం కోసం తింటున్నాం. కనుక ఈ పద్ధతి మంచిది కాదు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కు వెళ్ళినప్పుడు తప్పదు. కానీ ఇళ్లల్లో మాత్రం నూనెలో దేవించినవి వండక కాకపోవడమే మంచిది. సాధ్యమైనంతవరకు ఇలాంటి అలవాటులకు కుటుంబాలను దూరంగా ఉంచుకోవడం మంచిది. దీని ద్వారా మన కుటుంబాలను మనమే రక్షించుకోవచ్చు