ఉడుము మాంసం తింటున్నారా అయితే వెంటనే ఈ నిజం తెలుసుకోండి

ఉడుము గురించి తెలుసుకుందాం, పల్లెటూర్లలో ఉండే ప్రతి ఒక్కరికి ఉడుము అంటే తెలిసే ఉంటుంది.పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు ఉడుము ని చూసి ఉంటారు, ఎందుకంటే గ్రామాలలో తరచూ వేటకు వెళుతూ ఉంటారు, ఇలా వేటకు వెళ్ళినప్పుడు ఉడుము తీసుకు వస్తూ ఉంటారు.అంతే కాకుండా గ్రామాలలో పశువులను మేపడానికి వెళ్లిన వారికి కూడా, ఈఉడుములు కనిపిస్తూ ఉంటాయి. వాళ్లతో వచ్చిన కుక్కలు ఉడుములు పడతాయి, కాబట్టి వారు ఇంటికి తెచ్చుకొని వండుకొని తింటారు. ఉడుము చూడడానికి బల్లిని పోలినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక మాదిరిగా తొండల కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఉడుము నలుపు రంగులో ఉండి, ఎంతో బలంగా ఉంటాయి.

దీనికి పొడవైన నాలుక ఉంటుంది, ఈఉడుము దగ్గరికి ఏమైనా కీటకాలు వస్తే, వెంటనే నాలుకతో ఆకీటకాలని లోపలికి తీసుకుంటుంది. అంతేకాకుండా బయట ఉండే చిన్నచిన్న గడ్డిని కానీ, పుట్టగొడుగులు కానీ, ఏమైనా గడ్డ కింద ఉండే చిన్నచిన్న దుంపల్ని కానీ, ఆహారంగా తీసుకుంటుంది. ఉడుము చెట్లపైన కానీ, చెట్ల కింద ఉండే తొర్రలో కానీ, పుట్టలో కానీ, చిన్న చిన్న బండల యొక్క రంధ్రాలలో కానీ జీవిస్తూ ఉంటాయి. చాలామందికి ఉడుములు అనగానే శివాజీ గుర్తుకు వస్తాడు. శివాజీ స్టోరీ తెలిసినవారికి కచ్చితంగా, ఉడుము అనగానే తెలిసే ఉంటుంది. ఎందుకంటే శివాజీ ఉడుముల ను ఎక్కువగా పెంచేవాడు. శివాజీ ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసినపుడు, ఆకోటలో పైకి ఎక్కడానికి ఉడుముల ని ఉపయోగించేవాడు.

hi to clean vdumu themonitor lizard - YouTube

ఉడుముల తోకలకి గట్టిగా తాడును కట్టి, ఉడుము ని బలంగా పైకి ఆకోటలో పైకి విసిరే వాడు. ఉడుములు ఎంతో బలంగా ఏదైనా పట్టుకుంటాయి కాబట్టి, ఆఉడుము గట్టిగా పట్టుకుని, దాని వల్ల శివాజీ తన అనుచరులు, ఉడుము యొక్క ఆసరాగా చేసుకొని, ఆగోడలపై ఎగబాకి ఆ రాజులపై విజయాన్ని సాధించే వారు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, మన పట్టు ఉడుం పట్టులాగా ఉండాలి అని, ఉడుముని కూరలా వండుకొని తినడం వల్ల, మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఎంతో బలంగా ఉంటాయి, అంతేకాకుండా వీటి కూర కూడా ఎంతో బలంగా ఎర్రగా గట్టిగా ఉంటుంది. మేక కంటే మరింత ఎక్కువగా బలంగా ఉంటుంది. మేక మాంసం ఉడకడానికి ఎంత టైం పడుతుందో, అంతకు రెండింతలటైం ఉడుము ఉడకడానికి పడుతుంది.

Youth Prepare Monitor lizard Biryani In Tamil Nadu Police Case Filed -  Sakshi

ఉడుము కూర తినడం వల్ల మన నడుము ఎంతో బలంగా తయారవుతుంది, నడుము నొప్పి ఇక జీవితంలో రాదు అని చెబుతూ ఉంటారు. పెద్దలు అంతేకాకుండా వాతపు నొప్పులుతో, బాధపడే వారు కచ్చితంగా ఉడుము ని తినాలి, ఎందుకంటే వాతపు నొప్పి తగ్గడానికి, గ్రామాలలో ఉడుము తినాల్సిందే అని అంటూ ఉంటారు. అంతేకాకుండా పక్షవాతం తగ్గాలంటే ఉడుమును తీసుకువచ్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండలో ఆరబెట్టి అందులోంచి ఒక రకమైన తైలాన్ని తీస్తారు. ఆతైలంతో పక్షవాతాన్ని తగ్గిస్తారు. మగవారు ఈఉడుము కూర తినడం వలన, ఎంతో బలాన్ని పొంది ఎంతో బలంగా దృఢంగా తయారవుతాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉడుములు పుట్టలో దాక్కుంటాయి …