ఊడిన జుట్టు స్థానంలో ఇది రాస్తే మల్లి మీ జుట్టు పెరుగుతుంది

మనం తల స్నానం చేసేటప్పుడు షాంపూ వాడడం వల్ల అందులో ఉన్న రసాయనాల కారణంగా జుట్టు అనేది పొడిబారడం , కొంత మందిలో జుట్టు రాలి పోవడం జరుగుతుంది. షాంపూ ఉపయోగిస్తూ కూడా మన జుట్టును కొన్ని ఆయుర్వేదాలను వాడి సరి చేసుకోవచ్చు. జుట్టుకు మందార అనేది చాలా మేలు చేస్తుంది . మందార పువ్వును మరియు ఆకును కూడ వాడవచ్చు . మందార అనేది మన దేశంలో చాలా మంది తమ పెరటి మొక్కగా పెంచుతారు . మందార పూలను పూజలో కూడ వాడుతారు .ఆయుర్వేదంలో జుట్టు పెరుగుదలకు మందార అనేది ప్రసిద్ధమైన మూలిక . జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి మందార ఆకులు , మందార పువ్వులు మంచి నివారణగా పని చేస్తాయి .

మందార పువ్వులను బాగా పేస్ట్ లాగ చేసి జుట్టు బాగా పట్టించి కొద్దిగా ఆరిన తర్వాత తల స్నానం చేస్తే కుదుళ్ళు బాగా బలంగా అవుతాయి .మందార పువ్వులలో సహజంగా వుండే అమైనో అమ్లాలు జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలను జుట్టుకు అందిస్తాయి .చుండ్రు ఎక్కువగా వున్న వారిలో తల పైన చాలా దురదగా ఉంటుంది . అలాంటి వారికి మందార అనేది మంచి ఆస్ట్రిజెంట్ లాగ పని చేస్తుంది . జుట్టుకు మందార ఆకులను వాడడం వల్ల జుట్టు యొక్క pH బాలన్స్ చేస్తుంది .