ఎలాంటి శ్ర‌మ లేకుండా సుల‌భంగా కొబ్బ‌రిని చిప్ప నుంచి ఇలా తీయండి..!

Coconut : ప్రతి ఒక్కరు కూడా, కొబ్బరిని వాడుతూ ఉంటారు. కొబ్బరి పచ్చడి వంటివి చేయడంతో పాటుగా, కొబ్బరిని తురిమేసి, ఎందులోనైనా వాడుతూ ఉంటాము. అయితే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత, ముక్కలు కింద కట్ చేసుకోవడం పెద్ద సమస్య అవుతుంటుంది. కొబ్బరి పెచ్చు నుండి తీయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే, కొబ్బరి చిప్ప నుండి ఎలా కొబ్బరిని బయటకు తీయాలి..? ఈజీగా ఎలా తీసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక చేశారంటే, ఈజీగా క్షణాల్లో కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని,

మొత్తం తీసేయొచ్చు. పైగా ముక్కలా వచ్చేస్తుంది. చేతులు కూడా నల్లగా అయిపోవు. ఈజీ టెక్నిక్ ఇది. ముందు కొబ్బరికాయని కొట్టండి. రెండు చిప్పల కింద కొబ్బరికాయ విడుతుంది కదా, ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి, ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇడ్లీ రేకులు పెట్టి రేకుల మీద కొబ్బరిచిప్పని బోర్లించి పెట్టండి. రెండు చిప్పల్ని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. ఒక పది నుండి 15 నిమిషాల పాటు, స్టవ్ ఆన్ చేసి పెట్టండి. తర్వాత స్టవ్ ఆపేసి, చల్లారిన తర్వాత ఇడ్లీ పాత్ర ని ఓపెన్ చేయండి.

ఇప్పుడు మీరు ఒక చాకు తీసుకుని, కొబ్బరి చిప్పని చేత్తో పట్టుకుని, కొబ్బరి పెచ్చు చుట్టూ కూడా చాకుతో తీయండి. ఇలా జస్ట్ మనం చాకుతో గుండ్రంగా కొబ్బరి చిప్ప అంతా కూడా తీస్తూ ఉంటే, ఈజీగా చిప్ప నుండి కొబ్బరి వచ్చేస్తుంది. పైగా ఇలా ఉడికించడం వలన దాని రుచి కూడా ఏమీ మారదు. రుచి కూడా సేమ్. అలానే, ఎందులోనైనా మనం వాడుకోవచ్చు. కొబ్బరి పచ్చడి నుండి ఏ వంటకం చేసుకోవాలన్నా కూడా, ఇలా ఈజీగా మనం కొబ్బరి ని తీసుకోవచ్చు. ఈసారి, ఈ టెక్నిక్ ని ఫాలో అయిపోయి, ఈజీగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి ని తీసేసుకోండి.