ఒక్క చిన్న చిట్కాతో దోమలు మీ ఇంటిని మర్చిపోయేలా చేసే అద్భుతమైన చిట్కా.

ప్రజలు దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్, మస్కిటో బ్యాట్స్, మస్కిటో నెట్ ఇలా చాలా వాడేస్తున్నారు.కానీ దోమలను సమర్థవంతంగా వెళ్లగొట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే దోమలు రాకుండా ఉండాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి. ఈ మొక్కలని కనుక ఇంట్లో పెట్టినట్లయితే, అసలు దోమలే రావు. వానా కాలంలో దోమలు బెడద కారణంగా వ్యాధులు వ్యాపిస్తుంటాయి.

దోమల వలన మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామంది దోమలని తొలగించడానికి లిక్విడ్లు, కాయిల్స్ వంటి వాటిని వాడుతూ ఉంటారు అయితే ఇలా కాకుండా కొన్ని మొక్కలతో దోమలు రాకుండా చేయొచ్చు. నిమ్మ గడ్డి మొక్క ఇంట్లో ఉండడం వలన అస్సలు దోమలు రావు. నిమ్మ గడ్డి నుండి మంచి వాసన వస్తుంది ఆ ప్రత్యేకమైన వాసనతో దోమలు మన ఇంటికి చేరవు. తులసి మొక్క ఇంట్లో ఉంటే కూడా దోమలు రావు .

తులసి మొక్క ని సూర్యలక్ష్మి సోకే ప్రదేశంలో పెంచవచ్చు తులసి ఆకులని చర్మం పై రుద్దితే దోమ కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. రోజ్మేరీ కూడా దోమలు రాకుండా చేస్తుంది ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే రోజు మీరు ఈ మొక్కని కూడా పెంచండి జరీనియం అనే మొక్క నిమ్మకాయ వాసనని కలిగి ఉంటుంది. ఈ సిట్రస్ వాసన వలన కూడా దోమలు రాకుండా ఉంటాయి ఇలా ఈ మొక్కలని మీరు కనుక మీ ఇంట్లో పెంచినట్లయితే దోమలు లేకుండా ఉండొచ్చు దోమలు కుట్టినా ఇలా తులసితో ఉపశమనం పొందొచ్చు.