ఒక్క రాత్రిలో కళ్ళ కింద మచ్చలు మాయం ….

ఈరోజు మనం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఎందుకు కొన్ని విషయాలు అంటున్నానంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి చాలా ఈజీ గా వస్తున్నాయి, ఇది చాలా పెద్ద టాపిక్ ఒక్కరోజుతో కంప్లీట్ అయ్యేది కాదు కాబట్టి, ఒక ఎపిసోడ్తో కంప్లీట్ అయ్యేది కాదు కాబట్టి జనరల్ గా ఏ ఏజ్ నుండి వస్తున్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ అంటే ఇది 8 సంవత్సరాల నుండి ఇంకా చెప్పాలంటే ఏడు సంవత్సరాల వయస్సు పిల్లల నుండి కూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తున్నాయి. దీనిని సింపుల్గా ఏం చెప్తారు అంటే వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్తారు. ఈ ఏ జి నుండి స్టార్ట్ అయితే ఇంకా పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఇది ఎందుకు వస్తున్నాయి ఇంత చిన్న ఏజ్ లో నుండి అంటే అమ్మాయిలకు అయితే అనిమిక్ గా ఉంటుంది, మనం ఏదో మంచి ఫుడ్ పెడుతున్నాం మన పిల్లలకు అని అనుకుంటాం కానీ ఆ ఏజ్ అమ్మాయిల లో కూడా చాలామంది అనిమిక్ గా ఉంటున్నారు.

వీళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అండర్ ఐ డార్క్ సర్కిల్ బాగా ఉంది జుట్టు బాగా ఊడిపోతుంది అంటే ఒక్కసారి మీ హెచ్ బి కౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీ పిల్లలకు కానీ లేదా మీకు కానీ ఇది మేజర్ కారణం అవుతుంది.దీని తర్వాత మనందరికీ తెలిసిన మరొక రీజన్ ఏమిటంటే టీవీ మరియు ఫోన్. సెవెన్ ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు అంటే ఐపాడ్స్ కానీ ఫోన్ కానీ పట్టుకొని ఉంటారు. అందువల్ల రేడియేషన్ కారణంగా స్ట్రెయిన్ వల్ల చాలా వరకు కూడా ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా మంచి నీళ్లు త్రాగక పోవడం కూడా అనేది కూడా మరొక పెద్ద కారణం. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏదైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాకూడా అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో చాలా అరుదుగా ఈ కేసులు ఉంటాయి. ఆ తర్వాత నిద్ర అనేది కూడా ఒక మేజర్ కారణం.

ఎవరికైతే ప్రాపర్ గా నిద్ర ఉంటుందో అంటే ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోతారో అటువంటివారికి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కొంతమంది చెప్తూ ఉంటారు మాకు విటమిన్ డెఫిషియన్సీ ఉందని అందుకని మాకు డార్క్ సర్కిల్స్ వచ్చాయని అంటూ ఉంటారు కానీ విటమిన్ డి లోపం ఉంటే ఎవరికి కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రావు, మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలు కారణం అవుతాయి. మరొక రీజన్ ఏమిటంటే మీకు ప్రాబ్లం మరియు సైనస్ ప్రాబ్లం ఉంటే మీకు తరచుగా జలుబు వస్తూ ఉంటే అలాంటి వాళ్లకి కొంతమందికి కళ్ళు దురదలు వస్తాయి, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్లకు కూడా ఇలా కంటిలో దురదలు వస్తాయి , ఇలాంటివారు కళ్ళను బాగా నలుపుతూ ఉంటారు.

ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీసన్ ఫర్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్. ఇలా ఇలాంటి విషయాలను గమనించుకోండి కొంతమంది చేతులను పెట్టి బాగా నలుపుతూ ఉంటారు అందువల్ల స్కిన్ అనేది బాగా డామేజ్ అవుతుంది. మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి అసలు కొంతమంది అసలు పోవు అని అంటూ ఉంటారు, మీరు కనుక మనసు పెడితే ఇది ఖచ్చితంగా పోతాయి. అది ఎలా అంటే మనం ఇప్పుడు వాటి కోసం కొన్ని సింపుల్ టిప్స్ ను తెలుసుకుందాం. ఇంట్లో పాలమీద మీగడ ఉంటుంది కదా దానిని తీసుకొని రోజూ కాకపోయినా వీలైనప్పుడు ఆల్టర్నేట్ గా మసాజ్ చేయండి. ఎందుకంటే దానిలో విటమిన్ ఈ అనేది ఉంటుంది సేమ్ టైం దానిలో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. పాలు అనేవి నాచురల్ వైట్నర్, ఇది చర్మాన్ని సహజంగా చల్లబరుస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పాలమీగడ ను తీసుకుని ఐస్ కళ్ళచుట్టూ చేసుకోండి, ఇలా ఒక నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక పది నిమిషాల తర్వాత కడిగేయండి, చిన్న పిల్లలు అయితే వారికి మీరే చేయండి కొంచెం పెద్దవారు అయితే వారికి వారే చేసుకోవచ్చు.