ఒత్తుగా పొడవాటి జుట్టు ఉంటే ఆడవారికి మరింత అందం…

చాలామందికి జుట్టు అనేది చాలా సన్నగా పిలకలాగా ఉంటుంది. మరి సన్నగా పిలక లాగా ఉన్న మన జుట్టుని ఒత్తుగా దట్టంగా పొడవుగా పెంచుకునే ఒక అద్భుతమైన హోం రెమిడీ ఇది. ఈ ప్యాక్ ని మగ వాళ్ళు అయినా సరే ఆడ వారైనా సరే ఎవరైనా యూస్ చేయవచ్చు. అలాగే మనలో చాలామందికి వైట్ హెయిర్ అనే ప్రాబ్లం ఉంటే కనుక, మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్నట్లయితే , వైట్ హెయిర్ ని కూడా బ్లాక్ హెయిర్ గా మార్చుకునే అద్భుతమైన శక్తివంతమైన హెయిర్ ప్యాక్ ఇది.

అయితే ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకుంటాము, దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి తెలుసుకుందాం. ఆడవాళ్లు పొడవైన ఒత్తుగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే ఆడవారి అందాన్ని మరింత పెంచేది జుట్టు, మరి మన జుట్టు ఎంత పొడవుగా ఉంటే మనం అంతా అందంగా ఉంటాము. మరి పొడవాటి జుట్టు కోసం ఈరోజు మనం ముందుగా మంచి హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకుందాం.

మన జుట్టు పెరుగుదలకు మందార పువ్వులలో చాలా పోషకాలు విటమిన్స్ ఉన్నాయి. మన తలలో వైట్ హెయిర్ రాకుండా మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా దృఢంగా పెరగడం కోసం ఈ మందార పువ్వులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మందార పూలను రేకులుగా తీసుకుని, పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మందారం పేస్ట్ ని మనం వేరొక బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే మనం మందార ఆకులను కూడా తీసుకోవాలి.

మనం మందార పువ్వులను ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాము మందార ఆకులను కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ మందార ఆకులను కూడా పేస్టులాగా చేసుకోవాలి, ఇలా మందార ఆకుల పేస్టును మందార పువ్వుల పేస్టును కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మన జుట్టులో ఉండే చుండ్రు అంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మందార ఆకుల పేస్టును అలాగే మందార పువ్వు పేస్టును ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ని వేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్ ని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మన జుట్టుకుదుల్ల మొదల నుండి చివర్ల వరకు కూడా బాగా దట్టంగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత కుంకుడుకాయలతో కానీ లేదా షాంపుతో కానీ తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఎవరికైతే జుట్టు సన్నగా తోకలాగా ఉంటుందో అలాంటివారు ఈ ప్యాక్ కనుక 15 రోజులపాటు రెగ్యులర్గా వాడినట్లయితే కనుక మీ జుట్టు అనేది స్ట్రాంగ్ గా, పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. తక్కువ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే ఈ రెమిడిని వాడినట్లయితే చాలా స్పీడ్ గా 15 రోజులలోనే మీ జుట్టు రాలడం ఆగి మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.