నీరసం అనిపిస్తుందా ? ఇదొక్కటి మీ దగ్గర ఉంటే చాలు…

మనం ఏది సాధించాలన్న ఏ పని చేయాలన్నా ముందు మన శరీరం అనే యంత్రం కరెక్ట్ గా ఉండాలి. దీన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి మనం శ్రద్ధ పెట్టడం చాలా తక్కువ. ఈ శరీరం కాస్త మంచి ఆహారం అందించనప్పుడు అది బలహీనమవుతుంది. కొన్ని పోషకాహారాలు ముఖ్యంగా విటమిన్స్ లాంటివి అందనప్పుడు, కొంత ప్రోటీన్ అందనప్పుడు, సరైన మినరల్స్ అందనప్పుడు శరీరంలో కొంత లోపం వల్ల బలహీనత ఏర్పడుతుంది. ఆ బలహీనతని మనం నీరసంగా చెప్పుకుంటాం, మనం ఏదైనా పని చేయాలన్నా నీరసం అనిపిస్తుంది. పని చేసేటప్పుడు కాళ్లు లాగుతూ ఉంటాయి, పిక్కలలో నొప్పులు వస్తుంటాయి ఇక పని చేయడానికి నాకు శక్తి లేదు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటన్నిటినీ మనం నీరసమనే పదంతో ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటాము. నాకు నీరసంగా ఉంది కాబట్టి నేను ఏమి చేయలేక పోతున్నాను.

ఈ నీరసం అనేది కొంతమందికి ఫిజికల్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్లు కొన్ని సరిగ్గా తిననందువల్ల కొన్ని పోషకాలు అందనందు వల్ల వీరికి ఈ నీరసం కనిపిస్తూ ఉంటుంది. దీని నుండి బయటపడడం చాలా తక్కువ సమయంలోనే జరుగుతుంది. అందుకని ఫిజికల్ గా వచ్చే నిరసాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా మందులు అక్కర్లేదు. నానబెట్టిన వేరుశనగ పప్పులు ,నానపెట్టిన జీడిపప్పులు, పుచ్చ గింజలు, పిస్తా పప్పులు ఇలాంటివి తినడం, మొలకెత్తిన విత్తనాలు తినడం చేస్తే మంచి బలం వస్తుంది. పాలిష్ పట్టని ధాన్యాలు అన్నం గాను పుల్కాలుగాను చేసుకొని తినడం, కాస్త కూరలలో పప్పు రాజ్మా గింజలు సోయా చిక్కుడు గింజలు ఇలాంటివి వేసుకుని తినడం వల్ల మంచి బలం వస్తుంది.

భోజనం తర్వాత నువ్వుల ఉండలు వంటివి కాస్త వేరుశనగ పప్పుల ఉండలు ఇంకా కొన్ని రకాల ఉండదు లాంటిది చేసుకొని తినడం చాలా బలాన్ని ఇస్తాయి. ఈ రకమైన ఫిజికల్ నీరసాన్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ సొల్యూషన్ కానీ అసలైన నీరసం కొంతమందికి మరొకటి ఉంది. ఏమిటంటే మానసిక నీరసం, దీనికి వైద్యం త్వరగా ఉండదు, దీనికి మందు డాక్టర్ దగ్గర ఉండదు, మీ దగ్గరే ఉంటుంది. ఈ మనోనీరసాన్ని తగ్గించడానికి మీరు మీ పద్ధతిని మార్చుకోవడం తప్ప మరొక సొల్యూషన్ ఏమీ లేదు. ఈ మనోనీరసం అంటే ఏమిటంటే మనసులో వచ్చే నీరసానికి శరీరం కూడా వీక్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన ఫిజికల్ నీరసం అనేది బాడీలో ఉండవచ్చు కానీ మీ మైండ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది మీరు ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈ నీరసం మానసిక నీరసం అనేది ఫిజికల్ గా కూడా నీరసం వచ్చేలాగా చేస్తుంది. అందుకని మానసికమైన నీరసమే అసలైన నీరసం అని చెప్పవచ్చు.