కాల్షియం లోపం అంటే ఏమిటో మర్చిపోతారు..వృద్ధాప్యాన్ని పోగొట్టి బలాన్ని ఇస్తుంది.

శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలన్నా.. గుండె ఆరోగ్యంగా పని చేయాలన్నా, హార్మోన్ల సమతుల్యత, రక్తపోటు, అలాగే బరువు నియంత్రణలో ఉండాలంటే మనకు క్యాల్షియం అవసరమవుతుంది. అంతేకాకుండా ఇతర జీవక్రియలకు కూడా క్యాల్షియం కావాలి. కాలు కండరాలు ప‌దే ప‌దే ప‌ట్టేస్తుంటే, క్యాల్షియం లోపం ఉన్న‌ట్లు తెలుసుకోవాలి.

కొన్ని సార్లు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అలా జ‌ర‌గ‌వ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కాల్షియం లోపం ఉన్న‌ట్లు తేలితే.. వైద్యుడి సూచ‌న మేర‌కు మందులు వాడాలి. కాల్షియం లోపం ఉంటే చేతి వేళ్లలో గుండు పిన్ను గుచ్చిన‌ట్లు అనిపిస్తుంటుంది.

అలాగే వేళ్లు మొద్దుబారిపోయి, స్ప‌ర్శ లేన‌ట్లు అనిపిస్తాయి. త‌ర‌చూ ర‌క్త‌పోటు పెరుగుతుంటే క్యాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించి చికిత్స తీసుకోవాలి. చిన్న‌పాటి దెబ్బ లేదా గాయం త‌గిలినా ఎముక‌లు విరిగితే కాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. కాల్షియం లోపం ఉంటే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గుతార‌ని, స‌న్న‌గా మారిపోతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.