రేషన్ కార్డు దారులకు భారీ షాక్.. అలాంటి కార్డులన్ని రద్దు చేసిన ప్రభుత్వం..!

Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని, బోగస్ రేషన్ కార్డులు ఏరి వేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించింది. గత ఆరు నెలలుగా తెలంగాణలో రేషన్ కార్డుల ఈ – కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ కార్డుదారులు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకున్నారు. రేషన్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్ నెంబర్ చెప్పి ఆ తర్వాత వేలిముద్ర ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డ్ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 70% రేషన్ కార్డుల్లో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా రేషన్ కార్డ్ ఈ-కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29 తో గడువు ముగిసింది. దీంతో రేషన్ కార్డ్ ఈ-కేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా ఈ -కేవైసీ చేసుకోలేదు వీటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు అనుకుంటే ఇందులో ముగ్గురు సభ్యులు ఈ-కేవైసీ చేసుకున్నారు. మిగతావారు చేసుకోలేదు దీంతో ఆ ఇద్దరు పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే రేషన్ కార్డులో అదే ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది.

తెలంగాణలో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల సందర్భంగా చాలామంది కొత్త రేషన్ కార్డులు కోసం అప్లై చేశారు. వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారికి గృహజ్యోతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకం లభిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది రేషన్ కార్డు కోసం అప్లై చేశారు. కానీ రేషన్ కార్డులు ప్రభుత్వం ఇంకా జారీ చేయలేదు. అప్లై చేసిన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తారా లేదో అర్థం కాని పరిస్థితి. మరి ముఖ్యంగా పట్టణాలలో ఉంటున్న వారికి రేషన్ కార్డులు చాలామందికి లేవు. దీంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈసారి కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.