కొన్ని సంవత్సరాలుగా నెలలుగా ఆగిపోయిన నెలసరి ఇదితాగిన వెంటనే వచ్చేస్తుంది చాలా మందికీ రిజల్ట్ వెంటనే.

ఎప్పటినుండో ఆగిపోయిన పీరియడ్స్ వెంటనే రావాలి అంటే ఈ రెమెడీని తయారు చేసుకుని పాటించి చూడండి. ఈ సమస్య వల్ల మీరు డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా మనం ఇంట్లో తినే వాటితోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన పదార్థాలు సొంటిపొడి , ఈ సొంటి పొడి అనేది రెమిడి లో మనకు చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది, తర్వాత మనకు కావలసిన పదార్థం జీలకర్ర ఈ జీలకర్రను ఎక్కువగా మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు, వాము ఈ ఈ వాము అనేది వాత రోగాలకు కఫానికి చాలా చక్కగా పనిచేస్తుంది.

మనకు డైజేషన్ సరిగ్గా లేకపోయినా, కాళ్లు చేతులు లాగినట్లు అనిపించినా కూడా ఈ వాము అనేది తినడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ వామును కూడా వేసుకోవాలి, ఈ రెండిటిని బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి, అలాగే ఒక అర స్పూన్ సొంటి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, తర్వాత కొద్దిగా చిన్న స్పూన్ తో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, ఆ తర్వాత ఒక చెంబు నీళ్లు పోసుకోవాలి.

ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ ఫై మరిగించుకోవాలి, ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి, ఇలా చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. దీన్నే నిద్రపోయే ముందు అంటే ఒక గంట ముందు తాగేసి పడుకోండి. ఇది తాగిన తర్వాత మరుసటి రోజు పీరియడ్స్ వస్తే మళ్ళీ తాగాల్సిన అవసరం ఉండదు, ఒకవేళ రానట్లయితే వస్తుంది. దీన్నే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగేయాలి చల్లారిన తర్వాత త్రాగకూడదు, అలాగే బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా త్రాగకూడదు.