మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఇవి చేసి చూడండి.

ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనపడేది.ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో కనిపించే సమస్య గా మారింది. అయితే మూత్ర పిండాల్లో వచ్చే రాళ్ళు కరగడానికి ఇంట్లోనే దొరికే వస్తువులు ఉపయోగపడుతాయి అని ఎంత మందికి తెలుసు.. ఈ విషయం తేలిక చాలా మంది వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ కింది టిప్స్ వాడే ముందు మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస్కోవాలి. మీకు మూత్ర పిండాలలో ఏర్పడిన రాళ్ళు వలం 5 మిల్లీ మీటర్లు కంటే తక్కువ ఉంటేనే ఫాలో అవ్వాలి. ఆపై ఉంటే మీరు వైద్యులను సంప్రదించాలి.

మూత్రపిండాల్లో రాళ్ళు కరగడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడుతాయి. మెంతులను ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపునే తాగడం వలన మూత్రపిండాల్లో వచ్చిన రాళ్ళు త్వరగా తొలగిపోతాయి. ఈ నీటిని తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు కూడా బయటకి వెళ్ళి పోతాయి.నేరేడు పళ్ళు గ్రామాల్లో ఏవి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. నేరేడు పళ్ళు మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళు కరిగించడం చాలా బాగా ఉపయోగపడుతాయి.

అయితే నేరేడు పళ్ళు అన్నీ కాలాల్లో దొరకవు, అవి దొరికినపుడు కనీసం రోజులో రోజుకు ఒకటి అయిన తీసుకోవాలి. నేరేడు పళ్ళు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ళనే కాకుండా జీర్ణాశయంలో ఉన్న వెంట్రుకలు రాళ్ళను కూడా కరిగెలా చేస్తాయి.కొత్తిమీర కూడా మూత్రపిండల్లో వచ్చిన రాళ్ళను కరిగించడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను వేడి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టుకొని తీసుకోవడం వలన రాళ్ళ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర రోజువారి ఆహారం లో కూడా తీసుకోవడం వలన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 5 నుండి 6 లీటర్ల నీటిని తీసుకోవాలి.