క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ ..త్వరలో క్యాన్సర్ కు టీకా వచ్చేసింది..

ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష మందికి ఒకరిలో కనిపించే అత్యంత అరుదైన అనారోగ్య సమస్య క్యాన్సర్..ఇప్పుడు వెయ్యిలో ఒకరికి ఉన్నట్లుగా మారిపోయింది. క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది బలైపోయారు. ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ..అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. అందుకే క్యాన్సర్‌ అంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా, వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు.

అయితే కొందరు ఈ క్యాన్సర్ మహమ్మారి జయించారు. అయితే ఈ క్యాన్సర్ నివారణకు టీకాలు రానున్నట్లు గతంలో బాగా ప్రచారం జరిగింది. తాజాగా క్యాన్సర్ టీకా చికిత్స ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుంది. ఈరోగాన్ని ఎదుర్కొనే టీకా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు రూపొందించిన సమర్థ మార్గం ఇలాంటి ఈ ఆశలే రేకెత్తిస్తోంది. క్యాన్సర్ కు త్వరలో రాబోయే టీకా ఫ్లూ, పోలీయో వంటి టీకాల మాదిరిగా జబ్బును నివారించదు. కానీ ఆ రోగాన్ని తిరగబెట్టకుండా కాపాడుతుంది.

కణితి కణాల్లోని ప్రోటీన్లను ప్రమాదకరమైనవిగా గుర్తించేలా రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇమ్యూనో థెరపీ ప్రభావాన్ని మరింత పెంచుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. శాస్త్రవేత్తలు క్యాన్సర్ టీకాలను రూపొందించే క్రమంలో అనేక పరిశోధనలు చేశారు. రోగ నిరోధక చికిత్సను ఎంఆర్ఎన్ఏ టీకాతో కలిపి ఇవ్వగా.. చర్మ క్యాన్సర్ తిరగబెట్టే ముప్పు తప్పుతుందని తేలింది. అలానే మరణించే అవకాశం 44 శాతం వరకు తగ్గుతున్నట్లు బయటపడింది. అందుకే ఈ వార్త అందరిలో చాలా ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్థ్యం ఓ చిన్నపాటి పరిశోధనలో బయటపడటం ఇదే తొలిసారి. అదే పెద్ద పరిశోధనల్లోనూ ఈ టీకా విషయంలో మంచి ఫలితం కనిపిస్తే మాత్రం క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు రాగలవని భావిస్తున్నారు. అయితే ఈ టీకాను మార్కెట్ లోకి విస్తృత్తంగా అందుబాటులోకి తేవడానికి చేయాల్సిన పని చాలానే ఉంది. క్యాన్సర్ బాధితుల్లోనే కణితుల్లోని జన్యువులకు అనుగుణంగా ఈ టీకాను రూపొందించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికి క్యాన్సర్ టీకా విషయంలో బయటకు వచ్చిన ఈ వార్త అందరిలో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి..త్వరలో క్యాన్సర్ టీకా రానుందనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.