ఈ రోజు శివ ముక్కోటి..100 ఏళ్ళ తర్వాత వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం చూస్తే రాజయోగమే ..!

శాస్త్రాన్ని అనుసరించి అనేక పుణ్యతిథులు ఉంటాయి. అయితే జనవరి 6న శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణు మూర్తి, నారాయణుడి అనుగ్రహం కోసం వెళ్తామో.. అలానే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. జనవరి 6 ఎందుకంత ప్రత్యేకం అంటే.. వంద సంవత్సరాల క్రిందట ఏర్పడిన పుణ్యతిథి ఇది. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శివ ముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు.

కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పైగా సంపదను సూచించే శుక్రవారం నాడు వచ్చింది. కాబట్టి ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన రోజు. వంద ఏళ్ల కొకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు.. శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే.. కోటి సార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం అంటేనే అన్నాభిషేకం. శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఈ అన్నాభిషేకం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం చేయడంతో పాటు, అన్నదానం కూడా చేయాలి.

శివుడికి,శివ బంధువులకి అన్నదానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక ప్రతి రోజూ ఆరుద్ర నక్షత్రం చూడడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. మరి ఆ నక్షత్రాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఎంతో పవిత్రమైన ఈ పుణ్యతిథి నాడు వచ్చిన శివ ముక్కోటి రోజున అన్నదానం ఎలా చేయాలో, పాటించాల్సిన నియమాలు, విధి, విధానాలు తెలుసుకోవడం కోసం కింది వీడియోని వీక్షించి.. ప్రముఖ జ్యోతిష్యులు నంది భట్ల శ్రీ హరి శర్మ స్వామి వారి మాటల్లో తెలుసుకోగలరు.