గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి!

ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌లు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇది అని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే గుండెపోటుకు గురయ్యే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు. అవి ఏంటంటే.. ఈమధ్య కాలంలో  గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పటి వరకు ఎంతో బాగా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు ఉన్నట్లుండి.. గుండెపోటు కారణంగా కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. ఒకప్పుడు గుండెపోటు అంటే 50-60 ఏళ్లు పైబడిన వారికి.. అందునా అధిక బరువు ఉండి, బీపీ, షూగర్‌ వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రమే హార్ట్‌ ఎటాక్‌ బారిన పడేవారు.

అయితే వీరంతా సడెన్‌గా చనిపోయే సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకునేవి. ముందుగా చాలా మైల్డ్‌ ఎటాక్‌ వచ్చేది. దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకుంటే.. తర్వాత గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గేవి. అయితే నేటి కాలంలో వచ్చే గుండెపోటు మరణాల్లో ఇలాంటి అవకాశాలు ఉండటం లేదు. గుండెపోటుకు గురవ్వడమే ఆలస్యం.. వెంటనే మృత్యువాత పడుతున్నారు. ఇక తాజాగా గుండెపోటు మరణాలకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోన బారిన పడ్డ వారు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారు, పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాల కారణంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి.

అనే సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వైద్యులు మాత్రం ఈ గుండెపోటు మరణాలకు, కరోనా, టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. గణాంకాలతో సహ వివరిస్తున్నారు. ఆ విషయం పక్కకు పెడితే.. గుండెపోటు వచ్చే ముందు మనలో కొన్ని అసాధరణ లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా గుండెపోటు వచ్చే అరగంట ముందు కొన్ని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని గనక సరిగా అంచనా వేయగలిగితే.. గుండెపోటు బారిన పడ్డా వెంటనే ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

లక్షణాలు ఇవే..

గుండెపోటు వచ్చే అరగంట ముందు చాలా మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే..

  • కడుపులో తీవ్రమైన నొప్పి.
  • పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం.
  • గ్యాస్‌, అసిడిటీ పెరిగినట్లు అనిపిస్తుంది.
  • ఛాతిపై విపరీతమైన ఒత్తిడి పేరుకున్న భావన కలుగుతుంది.
  • గొంతులో ఏదో అడ్డు పడ్డట్లుగా అనిపిస్తుంది.
  • ఏ పని చేయాలన్నా శరీరం బద్దకించడం, నీరసంగా అనిపించడం.
  • గుండె నుంచి వెన్ను భాగం వైపు నొప్పి కదులుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. చాలా మంది.. దీన్ని నడుం నొప్పిగా భావించి.. పట్టించుకోరు.
  • కొందరిలో ఏ పని చేయకపోయినా సరే.. చెమటలు పడుతుంటాయి. శారీరక శ్రమ చేయకపోయినా చెమటలు పట్టడం గుండెపోటుకు సంకేంతం అంటున్నారు.

ఇక గుండెపోటుకు గురయ్యే వారిలో సాధారణంగా ఎడమ చేతిలో నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. ఈ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే గుండె పోటుతో మృతి చెందే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంతేకాక పురుషులతో పోలిస్తే.. మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం కాస్త తక్కువ అంటున్నారు వైద్యులు. ఇందకు మహిళల్లో జరిగే రుతుస్రావం కూడా ఓ కారణమే అంటున్నారు. 45 ఏళ్లకు పైబడిన మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా గుండె పోటు వస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య గుండె పోటు నిష్పత్తి 1:10గా ఉంటుంది. అంటే ఒక మహిళకు గుండెపోటు వస్తే.. పది మంది పురుషులకు గుండె పోటు వస్తోంది అని తెలిపారు.

ఇక యువతతలో గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, మైదాతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్లే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు. వయసుకు తగ్గటుగా వ్యాయామం, యోగా, మంచి ఆహారపు అలవాట్లతో గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. మరి ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరగడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.