గుడ్ న్యూస్: ఇవి తింటే గుండె నొప్పి రమ్మన్నా రాదు….Heart Attack

మనం వంటింట్లో విరివిగా వాడే వస్తువులు ఉన్నాయి. అందులో పల్లీలు కూడా ఒకటి. ఇది బలమైన ఆహారం ఇందులో ఉండే పోషకాలతో మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ కొంతమంది ఇవి తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అపోహతో దూరంగా ఉంటారు. కానీ పల్లీలు మనకు అత్యంత ఉపయోగకరమైన ఆహారం. పేదవాడి జీడిపప్పుగా దీనిని పిలుస్తారు ఎందుకంటే చౌకగా లభిస్తుంది బలంగా ఉంటుంది. అందుకే దీనిని తినడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఎన్నో పోతాయట. 100 గ్రాముల పల్లిలో తీసుకుంటే 567 కేలరీల శక్తి 17 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 25 గ్రాముల ప్రోటీన్లు, 45 గ్రాములు గుడ్ కొలెస్ట్రాల్, 10 గ్రాముల ఫైబర్ 90 మైక్రో గ్రాముల పోలింగ్ యాసిడ్లు ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉండదు అందుకే గుండె జబ్బుల ముప్పు ఉండదు. ఇది పరిశోధనల ద్వారానే రుజువు చేయబడింది.

అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది పల్లీలు తింటే గుండెపోటు వస్తుందని ఉద్దేశంతో తినడం మానేశారు. వీటిని తినడం వల్ల మనకు మేలు జరుగుతుంది కానీ కీడు మాత్రం రాదు. పల్లీలలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు మాత్రమే ఉంటుంది. కీడు చేసే కొవ్వు ఏమాత్రం ఉండదు. పల్లెల్లో ఉండే ఫైటో స్టెరాల్ మన ఆహారంలో ఉండే కొలెస్ట్రాలను రక్తంలో కలవనీయకుండా చేస్తుంది. ఇందులో ఉండే రసాయన సమ్మేళనాలో కాలేయంలో ఉండే మలినాలను బయటికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్లు సరిగా అందరిని వారికి వ్యాయామాలు చేసే వారికి పల్లీలు ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి దేహదారుఢ్యం కలుగుతుందని చెబుతారు. గర్భిణీలో బాలింతలో పిల్లలు వ్యాయామాలు చేసేవారు ఆటగాళ్ళు అందరూ పల్లీలు ఆహారంగా తీసుకోవడం వల్ల, శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి.

దీంతో మంచి కొవ్వు పెరుగుతుంది చెడు కొవ్వు నిల్వ లేకుండా చేస్తుంది. వీటిని తగిన విధంగా తీసుకుంటే ఎలాంటి నష్టాలు లేవు. బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తీసుకుంటే మంచిది. ఇందులో రెస్పెక్ట్రాన్ అనే రసాయన సమ్మేళనం ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గడ్డ కట్టకుండా చేయడంలో తోడ్పడుతుంది. కూరల్లో మనం మసాలాలు ఉప్పు కారం చల్లుతున్నట్లే పల్లీలు కూడా చల్లుకొని తినడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. నానబెట్టి తీసుకోవడం వల్ల మనకి ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇంతకీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పల్లీలు కావాలని దూరం చేసుకుంటున్నారు. ఫలితంగా అనారోగ్యాలకు దగ్గరవుతున్నారు పల్లీలను నూనెలో వేయించకుండా డైరెక్ట్ గా తింటేనే మంచిది.