చెత్తతో ఉచితంగా పెట్రోల్.. ఎంత ఎక్కువ చెత్త ఉంటే అంత ఎక్కువ పెట్రోల్ ఇస్తారు.. ఎక్కడో తెలుసా ?

Free Petrol : పెట్రోల్ కావాలంటే ఏం చేస్తాం.. పెట్రోల్ బంక్ కి వెళ్లి రూ.110 చెల్లిస్తే లీటర్ పెట్రోల్ పోస్తారు అంటారా? కానీ.. రూపాయి కూడా ఖర్చు కాకుండా.. ఉచితంగా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. కాకపోతే మీరు ఒక పని చేయాలి. మీ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తీసుకొచ్చి వీళ్లకు ఇవ్వాలి. అదేంటి.. చెత్తను చెత్తడబ్బాలో వేస్తాం కదా. చెత్తకుప్పలో పడేస్తాం కదా. వీళ్లు ఆ చెత్తను ఏం చేసుకుంటారు అంటారా? అవును.. వాళ్లు ఆ చెత్తను రీసైకిల్ చేస్తారు. మీరు ఎంత చెత్త ఇస్తే.. అంత ఎక్కువ పెట్రోల్ మీకు వస్తుంది. రీఫ్యుయల్ విత్ రీసైకిల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇది ఎక్కడో అనుకునేరు. మన హైదరాబాద్ లోనే కోకో అనే పెట్రోల్ బంక్ లో దీన్ని ప్రారంభించారు. హైటెక్ సిటీలో ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఈ బంక్ బ్రాంచీలు హైదరాబాద్ లో మొత్తం ఐదు ఉన్నాయట. ఏ బ్రాంచ్ కైనా సరే.. చెత్తను తీసుకెళ్లి పెట్రోల్ ఉచితంగా కొట్టించుకోవచ్చు.అక్కడ దీని కోసం ఒక మిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాని పేరు వెండింగ్ మిషన్. అందులో చెత్త వేయాలి. కాకపోతే చెత్తలోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఏ చెత్తను పడితే ఆ చెత్తను తీసుకోరు. పెట్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్స్ లాంటివి వేస్తే ఎక్కువ ఫ్యుయల్ వస్తుంది.

Free Petrol : వెండింగ్ మిషన్ లో చెత్త వేస్తే పెట్రోల్ బయటికి :-

ప్లాస్టిక్ వేస్ట్, పేపర్స్, కార్డ్ బోర్డ్స్, బుక్స్, ఈ వేస్ట్ లాంటి మొబైల్స్, లాప్ టాప్స్, మానిటర్స్, కేబుల్స్, నెట్ వర్క్ ఎక్విప్ మెంట్, గ్లాసెస్, మెటల్ లాంటివి తీసుకెళ్లి పెట్రోల్ పొందొచ్చు. హైటెక్ సిటీతో పాటు రాజ్ భవన్ రోడ్, మియాపూర్ లో వాళ్ల వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లోని చెత్తను చాలా జాగ్రత్తగా సేకరించి బయట పారేయకుండా తీసుకెళ్లి అక్కడ ఇచ్చి ఉచితంగా పెట్రోల్ పొందండి.