జుట్టు ఎంత సన్నగా, బలహీనంగా ఉన్న ఈ రెమెడీతో జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది…!

Hair Tips : మనలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది దీనివల్ల బాధపడుతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు. బయట పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది దాని వలన కూడా కావచ్చు. మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఈ సమస్యను పోగొట్టలేరు. ఇప్పుడు మనం దీనికోసం ఒక రెమిడి చేసుకోబోతున్నాం.. మన ఇంటి వంట గదిలోనే ఈ పదార్థం ఉంది. దీనిలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదే మెంతులు.. శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అసలు దీనిని ఎలా వాడాలో చూద్దాం.. ఇప్పుడు ఈ మెంతుల్ని ఎలా వాడాలి అన్న దాని గురించి తెలుసుకుందాం.

ఈ మెంతుల్ని ఒక పెద్ద చెంచాడు తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి నీళ్లలో ముందు రోజు రాత్రి అంతా నానబెట్టండి.ఆ తర్వాత రోజు ఆ నీళ్లను ఒక గిన్నెలో పోసి మిగతా మెంతుల్ని ఇంకో గిన్నెలో వేసి మరి కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేడి చేయండి. ఆ తర్వాత వాటిని ఫుల్ గా బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వలన ఇంకేమైనా నీరు శాతం ఉంటే అవి కూడా కిందకి దిగిపోతాయి. అలా కొంచెం సేపు అయ్యాక ఇందాక తీసుకున్న గిన్నెలో పోసి ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మీ దగ్గర మెంతులు మరియు మెంతులు నీళ్లు ఉన్నాయి ఇక ఇప్పుడు ఒక మూడు విటమిన్ ఏ టాబ్లెట్స్ తీసుకుందాం. ఆ మూడు విటమిన్ ఏ టాబ్లెట్స్ లోని రసం తీసుకుని ఇందాక మన దగ్గర ఉన్న మెంతుల నీళ్లలో కలపండి.

అలా రెండు మిక్స్ చేసి దానిని ఒక చిన్న డబ్బాలో భద్రపరచండి. ఇప్పుడు ఇందాక మన దగ్గర ఉన్న మెంతులని కొంచెం నీళ్లు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ల తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకి అప్లై చేసి కనీసం ఒక గంట సేపు ఉంచాలి. ఇలా చేయడం వలన మీ తలలోని ఏవైనా హాని కారకమైన మలినాలు ఉంటే అవి మొత్తం పోతాయి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనె తలకు రాసుకోండి. జుట్టు రాలకుండా ఉండడం కోసం అలా మీరు రోజు క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటు చేయాలి. మధ్య మధ్యలో ప్రతి రెండు రోజులకు ఒకసారి మన దగ్గర ఒక డబ్బాలో నీళ్లు ఉన్నాయి కదా మెంతుల నీళ్లు వాటిని రాసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వలన మీ జుట్టు కొద్ది రోజులకే రాలడం ఆగిపోతుంది.