టాలీవుడ్ లో యంగ్ హీరో, హీరోయిన్ చనిపోతారు: వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్

Astrologer Venu Swamy : సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో త్వరలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్ చనిపోతారని జోతిష్యం చెప్పాడు.

వేణుస్వామి.. సెలబ్రిటీలకు జోతిష్యాలు చెబుతూ.. ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారాడు. అయితే ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతుండటంతో అతడి జోతిష్యంపై సెలబ్రిటీలకు నమ్మకం కలిగి అతడి వద్దకు వెళ్లి తమ భవిష్యత్ ఎలా ఉందో చూపించుకుంటున్నారు కొందరు. ఇక తాజాగా తారకరత్న మరణంతో సినిమా ఇండస్ట్రీతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఈ క్రమంలోనే వేణుస్వామి రెండు నెలల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో త్వరలో ఓ యంగ్ హీరో చనిపోతాడు అని చెప్పాడు. తాజాగా తారకరత్న మరణించడంతో వేణుస్వామి వీడియో వైరల్ గా మారింది.

సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యంలో సూచనలు ఇస్తుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో వేణుస్వామి ఈ విధంగా చెప్పారు.”టాలీవుడ్ లో త్వరలో ఓ యంగ్ హీరో, హీరోయిన్ చనిపోతారు. వారి వయసు 45 ఏళ్ల లోపే ఉంటుంది. మీరు 90 సంవత్సరాల వారు చనిపోతే.. వయసు పైబడి చనిపోయారు అంటారు. కానీ ఇప్పుడు చనిపోయే వారు యంగ్ జనరేషనే.

అదీకాక మేష రాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన హీరో చనిపోతాడు. ఆ మరణం ఆత్మహత్య కావొచ్చు లేదా సహజ మరణం కావొచ్చు” అని వేణుస్వామి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అతడు చెప్పినట్లుగానే 40 సంవత్సరాలు ఉన్న తారకరత్న మరణించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే హీరోయిన్ కూడా మరణిస్తుంది అని చెప్పడంతో.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

అయితే 2027-28లో వారు చనిపోతారు అని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో చాలా మంది సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. దాంతో సెలబ్రిటీలు ఇతడి దగ్గరికి క్యూ కట్టారు. ఇప్పటికే రష్మిక మందన్న, కృతిశెట్టిలు వేణుస్వామి సూచనలతో పూజలు కూడా చేసినట్లు సమాచారం. మరి వేణుస్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.