తక్కువ ఖర్చులో కండ బలం పెరగాలి అంటే ఈ టిప్స్ పాటించండి

ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరమైనది. కానీ అవసరానికి మించి ప్రోటీన్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఒక వ్యక్తికి ఎంత ప్రోటీన్ అవసరం రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది పరిస్థితులను బట్టి వ్యక్తులని బట్టి మారుతుంది. పనులు చేయకుండా విశ్రాంతి తీసుకొనే వృద్దులకు వారికి 50 ఏళ్లు పైబడిన వారికి 0.8 గ్రా ప్రోటీన్ ఒక కేజి బరువుకి కావాలి. ఇలా మనిషి ఉండే బరువు ని 0.8 గ్రాములతో గుణించాలి. ఇలా ఎంత బరువు ఉంటే అంతే ప్రోటీన్ తీసుకొవాలి. ఇక వయసులో ఉండే వారికి ఉద్యోగాలు చేసే వారికి ఒక కేజి బరువుకు 1 గ్రా ప్రోటీన్ కావాలి.

ఇక పనులు చేసేవారికి బరువులు మోసేవారికి జిమ్ చేసేవారికి 1.7 గ్రా ప్రోటీన్ అవసరం ఎదుగుదల ఉండే పిల్లలకి 2 గ్రా ప్రోటీన్ కావాలి. పిల్లలు ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ అవసరం ఇక గర్బవతులకు 2.5 గ్రా ప్రోటీన్ అవసరం అవుతుంది. ఇలా మనం మోతాదుకు మించి ప్రోటీన్ తీసుకోకూడదు. అసలు మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి అంటే మన శరీరంలో రోజుకు కొన్ని కోట్ల కణాలు చనిపోతున్నాయి. ఈ కణాలు తిరిగి పుట్టాలి, ఈ కణాలు మళ్ళీ రావాలంటే ప్రోటీన్ చాలా అవసరం. హార్మోన్ తయారుకావడానికి కూడా ప్రోటీన్ కావాలి.

పోషకాలను నిల్వ చేయానికి కూడా ప్రోటీన్ కావాలి. రక్తం గడ్డకట్టడానికి కూడా ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ ఎక్కువగా తీస్కోవడం వలన వయసు రాకుండా కీళ్ల నొప్పులు వస్తాయి రక్తంలో ఉండే ph తగ్గిపోతుంది , ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ఎక్కువగా వస్తుంది , ఈ ప్రోటీన్ వలన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది. పప్పులు, ప్లాంట్ ప్రోటీన్ అంటే విత్తనాలు , మొలకలు బామ్ , పిస్తా తీసుకుంటే మనకు చాలా మంచిది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.