దసరా నవరాత్రుల్లో కదంబ వృక్షం మహిమ వింటే చాలు…

ఈరోజు మనం ఎంతో పవిత్రమైన, కదంబ వృక్షం గురించి మరియు, కథంబ వృక్షం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ అమ్మవారి స్వరూపం, ఈ వృక్షం మన భారతీయవులకు అత్యంత పవిత్రమైన వృక్షం. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలుకుతాయి, హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ కదంబ వృక్షం అని అంటారు . కదంబ వృక్షం ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది, నీడను ఇస్తుంది, ఈ కదంబ వృక్షాలు అడవులలో బాగా పెరుగుతాయి, వీటి పువ్వులు గుండ్రంగా ఉంటాయి. ఈ పుష్పాలనుండి అత్తర్లు కూడా తయారు చేస్తారు, ఈ చెట్టు ఆకుల నుండి పువ్వుల నుండి విలక్షణమైన పరిమళం వస్తుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు ఈ పువ్వులపై బాగా వాలతాయి.

ఈ కదంబ వృక్షం పెరగడానికి పెద్దగా నీరు అవసరం లేదు, ఈ కదంబ వృక్షానికి పురాణాలలో రెండు పేర్లు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో దీనిని కృష్ణ వృక్షం అని, దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షం అని పిలుస్తారు. ఈ వృక్షానికి కృష్ణునికి చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడనే జరిగాయి అంటారు. అందుకే ఈ వృక్షాన్ని కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణంలో అమ్మవారినే కదంబ వనవాసిని అంటారు, సాక్షాత్తు పార్వతీస్వరూపమైన ఈ వృక్షాన్ని, పార్వతీ వృక్షం అని అంటారు.నేటి మీనాక్షి ఆలయం ఉన్న ప్రాంతాన్ని కదంబవనం అంటారు. ఎంతో పవిత్రమైన ఈ వృక్షం పై పిడుగు పడదు అని అంటారు. అందుకే ఈ చెట్టు గురించి తెలిసినవారు,

అడవులలో తిరుగుతున్నప్పుడు, వర్షం ఎదురైతే కదంబ వృక్షం కింద నిల్చని వర్షపు ధారల నుండి రక్షణ పొందుతారు. ఈ చెట్టు కాయలను సందేహం లేకుండా తినవచ్చు, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కదంబ ఫలం బాగా పండినప్పుడు వాటి పొట్టలు విచ్చుకొని, అందులోని విత్తనాలు చెల్లాచెదురుగా పడతాయి.దీని ద్వారా చుట్టుప్రక్కల కదంబ వృక్షాలు మొలుస్తాయి. కదంబ వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవని, విడిపోయిన జంటను తిరిగి కలిపే పవిత్ర శక్తి ఈ వృక్షానికి ఉందని నమ్ముతారు. శ్రీమహావిష్ణువుకు పార్వతీదేవికి ఈ చెట్టుకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి భాగం పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.