నా 15 ఏళ్ళ అనుభవం ఇది….

జుట్టుకి ఎవర్ గ్రీన్ ఏమిటి అంటే మెంతులు అని చెప్పుకోవచ్చు, మెంతులు దాదాపు అందరికీ పడుతుంది, మెంతులను కడక వాడుకుంటే జుట్టు చాలా స్మూత్గా పొడవుగా పెరుగుతుంది.అలాగే డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది, మెంతులను రకరకాలుగా వాడుకోవచ్చు.మెంతులను మెత్తని పౌడర్ లా చేసి పెట్టుకొని, తర్వాత ఒక గరిటెడు పెరుగు తీసుకుని, రెండు స్పూన్ల మెంతి పొడిని తీసుకుని రెండిటిని బాగా కలుపుకోవాలి.దీన్ని ఒక రాగి గ్లాస్ లో వేసుకుంటే కాపర్ గుణాలు కూడా జుట్టుకు వస్తాయి, ఇది హెయిర్ కి చాలా మంచిది, దీన్ని రాత్రి రాగి పాత్రలో వేసుకుని ఉదయం జుట్టుకు పెట్టుకోవాలి.దీన్ని ఒక 45 నిమిషాల వరకు ఉంచుకోవాలి, ఇది 10 ఏళ్ల పిల్లల నుండి పెట్టవచ్చు. కొంతమందికి మెంతులను వాడడం వల్ల జలుబు చేస్తోంది.

ఒకవేళ మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు దీన్ని వాడకండి, తలను వాష్ చేసేటప్పుడు మొదటగా వెడల్పాటి దువ్వెనతో దువ్విన తర్వాత వాష్ చేయండి.ఇలా చేయడం వల్ల త్వరగా జుట్టు క్లీన్ అవుతుంది, ఇలా చేస్తే జుట్టు చాలా షైనీ గా ఉంటుంది.చిన్న మెంతం కూర ను ఒక కట్ట తీసుకొని వేర్ల దగ్గర కత్తిరించేయాలి, దీనిలో కొద్దిగా మందారం ఆకులను తీసుకొని రెండింటిని గ్రైండ్ చేయాలి, దీంట్లో నీటిని ఏమి వేయకూడదు, తర్వాత దీని నుండి రసాన్ని తీసుకోవాలి, దీన్ని కూడా జుట్టుకు పట్టించుకోవాలి, దీన్ని ఒక గంట తర్వాత వాష్ చేసుకోండి, ఇవి రెండు పద్ధతులు కూడా జుట్టు గ్రోత్ కి బాగా పనిచేస్తాయి.

కొంతమందికి శరీరంలో అధిక వేడి వల్ల జుట్టు ఊడిపోతుంది, తల నొప్పి వల్ల కూడా జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది, ఏదైనా చిన్న అనారోగ్యం శరీరం లోకి రాగానే జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది, దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ఐరన్ రిచ్ ఫుడ్ గనుక తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, అందుకోసం బీట్రూట్ ను ఆహారంలో భాగం చేసుకోండి, లెమన్ జ్యూస్ ని కూడా ఫుడ్ లో భాగం చేసుకోండి, రోజు కొంచెం ఒక చిన్న గ్లాస్ అయినా సరే పావు చెక్క నిమ్మరసం వేసి కాస్త తేనెను కలిపి తాగడం అలవాటు చేసుకోండి, మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ ని, నిమ్మరసం వల్ల శరీరం తీసుకోగలుగుతుంది.