నిద్రలో కూడా ఉహించి ఉండారు అంత సన్నగా అవుతారు…

ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆరోగ్య విషయాలలో చాలా ముఖ్యమైనది ప్రతి స్త్రీ మూర్తి ప్రతి ఇంట ఆరోగ్యంగా ఉండడానికి గృహంలో ఉండే ఎన్నో రకాల దినుసులతో మనం మన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవచ్చు. అందుకే కిచెన్ ఈజ్ ఆ స్మాల్ మెడికల్ షాప్ ఒక మందుల షాప్ అంటారు. వంటింట్లో ఉండే దినుసులతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని వంటింట్లో ఉండే దినుసులతో మనకు చాలా ఉపయోగకారి.

అందరికీ యోగ్యమైన ఆరోగ్య ప్రదాయిని జీలకర్ర. ఇటువంటి జీలకర్రను ఎన్నో రకాల జీర్ణకోశ, శ్వాసకోశ ముఖ్యంగా మన సంతాన ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై ప్రభావం చూపించేటటువంటి ఆహారంగా చెపుతారు. అందుకేనేమో బహుశా మన వంటింట్లో తాలింపులు వేసేటటువంటి దినుసులలో జీలకర్ర ప్రథమ పాత్ర పోషిస్తుంది. జీలకర్ర వేయగానే ఒక అమోఘమైన సువాసన వెదజల్లుతుంది. కొందరి ఇంట్లో జీలకర్ర వాసన రాదండి అంటూ ఉంటారు.

ఎందుకంటే ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను దినుసులను ఈ రోజుల్లో మార్కెట్లో వాటిలో ఉండే ఆయిల్స్ ని తీసేసి వాటిలో ఏ విలువలు లేని ఆకార పూరితమైన జీలకర్రను అమ్ముతున్నారు. అందుకని స్వచ్ఛమైన జీలకర్ర నలిపి వాసన చూస్తేనే మనకు వికారం తగ్గుతాయి, వాంతులు తగ్గుతాయి మనిషి మస్తిష్క స్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందుకని జీలకర్ర మన జీర్ణకోశం పై ప్రభావం చూపించేటటువంటి అద్భుతమైనటువంటి ఒక దినుసు. జీలకర్రలో నల్ల జీలకర్ర అని రోజు వాడే వంటలలో వేసుకునే జీలకర్ర అని రెండు ఉన్నాయి. మనం ఇప్పుడు నిత్యం వాడే జీలకర్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం.

ఈ నల్ల జీలకర్ర అనేది పూర్తిగా ఆయుర్వేద శాస్త్రం పరంగా వైద్యులు నిర్దేశించిన ప్రకారంగా మాత్రమే మనం వాడుకోవాలి. ఇప్పుడు మనం నిత్య జీవితంలో వాడే జిలకర విలువలు ఎంత గొప్పవి అంటే ఎప్పుడైనా మీ యొక్క శరీరంలో జీర్ణకోశ సమస్యలను ఏవి కనిపించినా మొదట మీరు జీలకర్రని నలిపి కొద్దిగా తిని నీళ్లు త్రాగిన సరే. అలాగే జీలకర్రని వేయించి ఆ పౌడర్ ని నీళ్లలో కలిపి సేవించుకున్న ఓకే. అంటే జీలకర్ర అనేది ఉదర సమస్యలను సరి చేసేటటువంటి ఒక గొప్ప దినుసు. జీలకర్ర మజ్జిగ తాగండి , జీలకర్ర వేసినటువంటి ఒక కారం పొడి తినండి, జీలకర్ర తాలింపు వేసినటువంటి పప్పు తినండి. మన జీర్ణ కోశంలో అరుగుదల శాతాన్ని దానిలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయనాల ప్రభావంతో తీవ్రస్థాయిలో అరిగిస్తాయి.