ఇవి ఎక్కడ కనిపించినా వదలకండి….

డయాబెటిస్ అనేది 100 మందిని తీసుకుంటే 30 మందికి సుమారుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీస్ లో ఉండే వారికి ఇంకా ఇంతకంటే కాస్త పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ డయాబెటిస్ అనేది సంవత్సరాల తరబడి గడిచే కొద్దీ అన్నిటికంటే ఎక్కువగా కంటిని డ్యామేజ్ చేస్తుంది. కంటిలో రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి, కంటికి వెళ్లే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కాబట్టి కంటి చూపుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకని డయాబెటిస్ రెటినోపతి డెవలప్ అయ్యి నిదానంగా చూపు తగ్గిపోవడం కొంతమందికి చూపు కోల్పోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ వల్ల కూడా హైబీపీల వల్ల కూడా చూపు తగ్గిపోవడం కంటి రెటీనాలో మార్పులు రావడం చాలా మందిలో గమనిస్తూ ఉంటాం. కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ కంటి రెటీనాలో కాస్త బలహీనత వచ్చి కణజాలం వీక్ అయిపోతుంది, అప్పుడు చూపు మందగించడం చూపు దెబ్బ తినడo కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది.

మరి ఇలాంటి వారికి డాక్టర్స్ అందరూ కూడా మీరు బీపీని ,షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేo అని చెప్తారు,అందుకని డామేజ్ అయిన చూపుని రికవర్ చేయలేరు. కానీ ఒక నేచురల్ సీడ్ ఉంది దీని కనుక మీరు పేస్ట్ చేసి వంటల్లో వాడుకున్నట్లయితే డయాబెటిక్ రెటినోపతిని అద్భుతంగా తగ్గిస్తుంది. చూపు పోకుండా , డయాబెటిస్ వారికి ఎంతమందికో కంటి చూపు పోతు ఉంటుంది, అలాంటి వారికి చూపు పోకుండా రక్షించడానికి అద్భుతమని చెప్పవచ్చు. ఏజ్ పెరిగేకొద్ది రెటీనా డామేజ్ జరగకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఈ సీడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సీడ్ పేరు అనాటో సీడ్, ఇది రెడ్ కలర్ లో ఉంటుంది, దీనిని నానబెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని కనుక వంటల్లో కలిపితే ప్రధానంగా నాచురల్ కలర్ వంటకి రావడానికి ఉపయోగపడుతుంది. ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ సాఫ్రాన్ కలర్ కానీ రెడ్ కలర్ వచ్చేటట్లు నేచురల్ కలర్ కింద దీన్ని వాడుతూ ఉంటారు.

కానీ ఇందులో ఉన్న సైంటిఫిక్ బెనిఫిట్ రెటీనాకి కంటి చూపుకి చాలా మంచిది. అలాగే పసుపులోను కుంకుమ పువ్వులో ఉన్న కెరోటినైట్స్ లాంటివి ఈ సీడ్స్ లో ఉండడం వల్ల వంటలకి నాచురల్ కలర్ వస్తుంది. ఎక్కువమంది దీనిని కలర్ కోసం వాడుతారు కానీ దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్ మాత్రం కంటి చూపుని కాపాడడానికి రెటీనాని రక్షించడానికి ఇది నెంబర్ వన్ సీడ్ అని చెప్పవచ్చు. ఈ అనాటో సీడ్ లో ఉన్న పోషకాలను తీసుకుంటే, 100 గ్రాముల అనాటో సీడ్స్ లో 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ 44 g ఉంటాయి, ప్రోటీన్స్ 4 గ్రామ్స్ ఉన్నాయి, ఫ్యాట్ 0. అసలు ఫ్యాట్ లేని విత్తనం ఏమిటో మనం చూడము, కానీ ఈ విత్తనంలో ఫ్యాట్ అనేది జీరో. ఫైబర్ 8 గ్రామ్స్ ఉంటుంది.