నేరేడు ఆకుని ఇలా తింటే షుగర్ ,బి.పి పరార్

ఎండాకాలంలో దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. నేరేడు పండ్లు మాత్రమే కాదు. నేరేడు గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు కి ఇది మరింత ఆరోగ్యం. నేరేడు పండ్ల లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీని కోసం మొదట నేరేడు పండ్లుని కడిగి వాటిని ఎండలో ఎండబెట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాలి.

మరింత సమాచారం కోసం పైని వీడియో చూడండి :-

ఒక స్పూన్ పౌడర్ ని తీసుకుని పాలల్లో కలిపి పరగడుపున ఆ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నేరేడు గింజల పొడి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే అతిమూత్రం కూడా అదుపులోకి వస్తుంది.   

నేరేడు 5నుంచి 10 గ్రాముల గింజల చూర్ణాన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  నేరేడు పండు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది. కడుపులో  వెంట్రుకలు, లేదా గట్టి పదార్థాలేవైనా ఉంటే కరిగిస్తాయి నేరేడు పండ్లు.  పంటి సమస్యలు, చిగుళ్ల నొప్పితో బాధపడేవారు నేరేడు పుల్లతో పళ్లు తోమితే పంటి సమస్యలు పోతాయి. నేరేడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోటికి మంచిది.ఈ చూర్ణం ఉపయోగించాలని అనుకునేవారు ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే ఎలా ఉపయోగించాలా అనే విషయాలను సూచిస్తారు.