పచ్చకామెర్లనును శాశ్వతంగా తగ్గించే నేలఉసిరి……ఇక జన్మలో రావు నన్ను నమ్మండి .

పచ్చకామెర్లు, (జాండీస్) :-

రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి.జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది. కామెర్లు కాలేయ సంబంధిత వ్యాధి.ఇటీవల కాలంలో తరచూ తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా కామెర్లను చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కన్నా ముందు ఇతరులే దీన్ని గుర్తిస్తారు. ఈ విచిత్ర పరిస్థితి కామెర్లలోనే కనిపిస్తుంది.

దీన్ని వ్యాధిగా చెప్పేకన్నా అంతర్గతంగా ఉన్న రోగ లక్షణాల సముదాయంగా చెప్పవచ్చు. వాస్తవానికి శరీరానికి ప్రాణవాయువు అనదగ్గ ఆక్సిజన్‌ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ పదార్థం ప్లీహంలో (స్పీన్) శిథిలమైపోయి బైలిరూబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతుంది. శరీరంలో ఈ పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా అభివర్ణించవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్‌డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడ నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలం పసుపు రంగులో ఉండటానికి ఇదే కారణంగా భావించవచ్చు.

Nela usiri plant use in ayurvedam.||నేల ఉసిరి ప్రయోజనాలు - YouTube

కామెర్లకు చికిత్స అనేక విధానాల్లో ఉంటుంది. హెమటాలజిస్ట్ సహాయంతో పరీక్షించినప్పుడే శిథిల కణాలు ఎక్కువగా పేరుకుపోవడానికి కారణం అర్థమవుతుంది. ప్రారంభ దశలో కామెర్లకు మందులతో చికిత్స అందించవచ్చు. కాలేయం పూర్తిగా పాడైనప్పుడు మాత్రం కాలేయ మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది. కాలేయ వాహికలో అంతరాయం కలిగినప్పుడు మాత్రం శస్త్రచికిత్స అవసరం అవుతుంది. రాళ్లు ఉన్నప్పుడు ఎండోస్కోపి విధానంలో, కేన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేయడం ద్వారా చికిత్స అందించాల్సి వస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లుగా కామెర్లు ఒక వ్యాధి అనడం కన్నా రోగ లక్షణాల సముదాయంగా చెప్పవచ్చు. దీన్ని తగ్గించడానికి ఇప్పుడు మంచి మందులు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. నాటు మందులను వాడి రోగాన్ని ముదరపెట్టుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.

వారానికోరోజు మజ్జిగ చాలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-

వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి. ఎక్కువ తింటే మెదడుకు ఎక్కగలదు. మలేరియాకు క్లోరోక్విన్ పూర్తి కోర్సు 10 బిళ్ళలు రెండున్నర రోజులపాటు భోజనం తరువాత వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది.