ఈ టైం లో నిద్రలేస్తే మీ జీవితంలో ఎన్నో అద్బుతాలు

ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే, తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా చేయండి, ఉదయాన్నే నిద్ర లేవడం వలన, ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా, తొందరగా నిద్ర లేవడం వల్ల, అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడమే కాదు, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, కీర్తిప్రతిష్టలు సంపాదించిన గొప్ప వారు, మేధావులు అందరూ వేకువజామునే నిద్రలేవడం వల్ల, అనుకున్నవి సాధించగలిగారు, మరి మీరు కూడా అనుకున్నవి సాధించాలంటే, ఉన్నత స్థితికి చేరుకోవాలంటే, తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అని పెద్దలు చెబుతున్నారు.

ఇలా ఉదయాన్నే నిద్ర లేవాలి అని, మనందరికీ తెలిసే ఉండొచ్చు కానీ, అలా నిద్ర లేవాలంటే బద్ధకం వేస్తుంది, మరి అలా ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే, ఏం చేయాలో తెలుసుకుందాం, ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే, ముందు రోజు రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్ర పోవాలి అంటే, ఎన్ని గంటలకు నిద్ర పోవాలి అనే సందేహం కలగవచ్చు, మనం రాత్రి పదింటి కల్లా నిద్రపోతే, తర్వాతి రోజు ఉదయాన్నే నిద్ర లేవగలుగుతాము, అంతే కాదు మన శరీరానికి నిద్ర ఎంత అవసరమో, అంత నిద్ర అందుతుంది.మనలో చాలామంది 12:00 వరకు చాటింగులు చేస్తూ, లేదా టీవీలు చూడటం చేస్తూ ఉంటారు, దానివల్ల మరుసటి రోజు ఎనిమిది గంటలకు, తొమ్మిది గంటలకు నిద్ర లేవడం చేస్తూ ఉంటారు, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడం, ఊబకాయం రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, అలసటకు గురి కావడం బద్ధకం గా ఉండటం వంటి సమస్యలతో పాటు, మలబద్ధక సమస్య కూడా వేధిస్తుంది, కాబట్టి రాత్రిళ్లు చాటింగ్లో టీవీలో చూడడం మానేసి, 10 కాగానే నిద్రపోతే, ఉదయాన్ని నాలుగు లేదా ఐదు గంటలకు నిద్ర లేవడం వీలు అవుతుంది.

Yoga Nidra for Kids (With Instructions) | LoveToKnow

ఇలా చేయడం మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు, మనం ఉదయాన్నే నిద్ర లేవాలి అనుకున్నప్పుడు, ముందు మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి, ఏ సమయానికి నిద్ర లేవాలి అని, అలారం పెట్టుకొని అయినా సరే ఉదయాన్నే నిద్ర లేవాలి, నిద్ర లేచిన వెంటనే ఫలానా పని చేయాలి, అని మనసులో అనుకొని, అలా లేవడం కోసం, మానసికంగా సిద్ధపడాలి, ఒక వేళ అలా ఒక రోజు నిద్ర లేవక పోయిన ప్రమాదమేమీ లేదు, తర్వాతి రోజు నుంచి ఉదయాన్నే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.అయితే ఇలా లేవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని పెట్టుకోవాలి, అప్పుడు ఆ పని చేయడం కోసం అయినా, త్వరగా నిద్రలేస్తారు, ఇలా ఉదయాన్నే నిద్రలేచి, గొప్పవారైన వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని, మనం కూడా అలా ఎదగాలని మనసులో గట్టిగా సంకల్పించుకుని ఉంటే, తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేవ గలుగుతారు..