పద్మనాభ స్వామిని మించిన పూరీ….

12వ శతాబ్దం నాటి భాండాగారం, మూడు తాళాలు ఒక్కటి మిస్ అయినా తలుపులు తెరవడం అసాధ్యం, సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య నాలుగేళ్ల క్రితం భాండాగారం లో ఏముందో తెలియకుండానే అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. కానీ మరోసారి తలుపులు తెరవాల్సిందే అన్న పురావస్తు శాఖ సూచనలతో యావత్ దేశం యొక్క అటెన్షన్ జగన్నాథుడు యొక్క భాండాగారంపై పడింది. ఇంతకు పూరి జగన్నాథుడి భాండాగారంలో ఎన్ని గదులు ఉన్నాయి? దశాబ్దాలుగా తెరుచుకొని ఆ మూడవ గదిలో ఏముంది? కనిపించకుండా పోయిన ఆ మూడవ తాళం ఎక్కడ ఉంది?

వెలకట్టలేని పురాతన సంపద అంత చిక్కని రహస్యగది కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సీక్రెట్స్ గుర్తొస్తున్నాయా కానీ ఇది ఒరిస్సా లోనే పూరి జగన్నాథుడి భాండాగార రహస్యం. 12వ శతాబ్దం నాటి ఈ భాండాగారంలో అంతులేని సంపద ఉంది అనేది జగమెరిగిన సత్యం. దశాబ్దాలకు ముందు రహస్య గదిని తెరిచిన అందులో ఉన్న సంపద ఎంత అన్నది స్పష్టంగా తెలియలేదు. 2018లో మరోసారి జగన్నాధుడి భాండాగార సీక్రెట్స్ చేదిద్దాము అనుకున్న పురావస్తు శాఖ అధికారులకు ఆ మూడు గదులలో ఒక గదికి సంబంధించిన తాళం మిస్సింగ్ మిస్టరీ అడ్డంగా మారింది. దీంతో ఆ గదిని టచ్ చేయకుండానే వెనుతిరిగారు, మళ్లీ ఇంతకాలం తర్వాత జగన్నాథుడి భాండాగారం తెరవాల్సిందే అని సూచించారు, 12వ శతాబ్దం నాటి ఈ బాండగారం స్థితిని అధ్యయనం చేసి మరమ్మత్తులు చేయాలి అనుకున్నారు. అయితే ఆ గదికి సంబంధించిన ఒక తాళం కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా తెరుస్తారు అనేది ఉత్కంఠంగా ఉంది.

పూరి జగన్నాథుడికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్రాల రత్నాభరణాలు ఈ భాండాగారంలోనే నిక్షేపంగా ఉన్నాయి. వెలకట్టలేనంత అపార సంపద అక్కడ ఉందని స్థానికులు కథలుగా చెప్తారు అయితే ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అనేది మిస్టరీగా మారింది. దీంతో భక్తులతో పాటు ఆభరణాల లెక్కింపు చేపట్టాలని ఇతర సంఘాల సైతం గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. పురాత నివేదికల్లో ఉన్న వివరాల మేరకు ఆభరణాలు అన్ని ఉన్నాయా లేదా అనేది స్పష్టం చేయాలి అని అందరూ కోరుతున్నారు. ఒకసారి రహస్య మందిరం తలుపులు తెరిస్తే ఖచ్చితంగా లెక్కింపు జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు అయితే భాండాగారం తలుపులు తెరవాలంటే ఆలయ పాలకవర్గంతో పాటు న్యాయశాఖ కూడా అనుమతించాల్సి ఉంటుంది. ఈ తలుపులు తెరిచే అంశంపై గతంలో చర్చ కూడా జరిగింది నిజానికి జగన్నాథుడి భాండాగారం గురించి అంతా రహస్యమే.

లోపల ఎన్ని గదులు ఉన్నాయి ఎంత సంపద ఉంది ఇవేవీ బయటకి తెలియవు, మహాలక్ష్మి నిలయంగా భక్తులు పిలిచే ఈ భాండాగారంలో విశాలమైన గదులు మూడు ఉన్నాయి అనేది కేవలం అంచనా మాత్రమే. విలువైన సంపద అంతా పుష్కలంగా ఉన్న దానిని పూర్తిగా చూసినవారు ఎవరూ లేరు ఈ భాండాగారాన్ని ఎవరు తెరిచే ప్రయత్నం చేయరూ. 1982లో ప్రభుత్వం తెరవాలనుకుంది ఆ సమయంలో బాండాగారంలోని రెండు గదులను తెరిచిన అధికారులు అసలైన మూడవ గది ప్రధాన ద్వారం వరకు మాత్రమే వెళ్లి లోపలికి వెళ్లకుండా తిరిగి వెళ్ళిపోయారు. గదిలోపల సర్పాల బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని దీంతో అధికారులు లోపలికి వెళ్లలేక పోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ లోపలికి వెళ్లలేక పోవడానికి అసలు కారణం ఆ గదికి సంబంధించిన మరో తాళం కనిపించకుండా పోవడమే.