పరిగడుపున గుప్పెడు తింటే డయాబెటిస్ ,రక్తపోటు ,అధిక బరువు సమస్యలు ఉండవు

ఓట్స్ భూమిపై ఉన్న ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఒకటి .ఓట్స్ గ్లూటెన్ రహిత ధాన్యం మరియు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ,ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి . ఓట్స్ మరియు ఓట్ మిల్ వాళ్ళ అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి .వీటిని తినడం వలన బరువు తగ్గడం ,రక్తం లో చెక్కెర స్థాయిలు తగ్గడం మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తాయి .ఓట్స్ మరియు ఓట్ మిల్ తినడం వల్ల వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం .

ఓట్స్ మరియు ఓట్ మిల్ అంటే ఏమిటి ?

ఓట్స్ ఒక ధాన్యపు ఆహారం ,శాస్త్రీయ నామంగా అవేనా సాటివా అని పిలుస్తారు ఓట్స్ యొక్క అసలైన రూపమైన ఓట్స్ గ్రోట్స్ వండడానికి చాలా సమయం పడుతుంది .అందుకే రోల్ చేయబడిన ఓట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు . తక్షనం వండుకోగలిగే ఓట్స్ అత్యంత ప్రాసెస్ చేయబడిన రకం .అవి ఉడికించడానికి అతి తక్కు వ సమయం తీసుకుంటే ,ఆకృతి మెత్తగా అవుతాయి .ఓట్స్ ను సాధారణంగా అల్పా హారంగా ఓట్ మిల్ గా తింటారు ఓట్స్ ను నీరు లేదా పాలలో ఉడికించి తయారు చేస్తారు . దీనిని సాదారణంగా అల్పాహారంగా కిచిడి ,ఉప్మాలాగా తింటారు .ఓట్స్ నమ్మశక్యం కానీ పోషకాలు గలది

ఓట్స్ యొక్క పోషక కూర్పు బాగా సమతుల్యoగా ఉంటుంది .

శక్తి వంతమైన ఫైబర్ బీటా -గ్లూకాన్తో సహా అవి పిండి పదార్దాలు

మరియు ఫైబర్ యొక్క మంచి మూలం .

అవి చాలా ధాన్యాల కన్నా ఎక్కువ ప్రోటీన్ మరియు కొవ్వును కలిగి
ఉంటాయి .

ఓట్స్ లో ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ యొక్క సమ్మేళనాలు ఉన్నాయి అర కప్పు 78గ్రాములు డ్రై ఓట్స్ ఉంటాయి

Porridge, Oatmeal Png - Ots Meaning In Gujarati, Transparent Png - kindpng

మాంగనీస్ :RDI లో 191% , భాస్వరం :RDI లో 41% , మెగ్నీషియం :RDI లో 34% , రాగి:RDI లో 24% , ఇనుము :RDI లో 20% , జింక్ :RDI లో 20% , ఫోలేట్ RDI లో 11% మరియు విటమిన్ బి 1 (థియామిన్ ):RDI లో 39% ,విటమిన్ బి 5 (పంతోతేనిక్ ఆమ్లం )RDI లో 10% తక్కువ మొత్తంలో క్యాల్షియం ,పొటాషియం ,విటమిన్ బి 6 (పిరిడాక్సిన్ )మరియు విటమిన్ 3 (నియాసిన్ )

ఓట్స్ లో 51గ్రాముల కార్బోహైడ్రేడ్స్ ,13గ్రాముల ప్రోటీన్ ,5గ్రాముల కొలెస్ట్రాల్ మరియు 8గ్రాముల ఫైబర్ తో వస్తోంది అయితే ఓట్స్ లో 303కేలరీలు మాత్రమే లభిస్తాయి కనుక బరువు ర్హగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక అంటే మీరు తినగలిగే పోషకకరమైన ఆహారాలలో ఓట్స్ కూడా ఉన్నాయి .