పేరుకే బాబాయ్..! చివరి రోజుల్లో తారకరత్నకి నాన్న అయిన బాలకృష్ణ..!

నందమూరి ఫ్యామిలీలో తారకరత్న లేని లోటు.. అందరికన్నా ఎక్కువగా బాలకృష్ణని బాధిస్తున్న విషయం. ఎందుకంటే.. లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన నిమిషం నుండి.. నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి, దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకున్నాడు.నందమూరి తారకరత్న.. 23 రోజులపాటు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే టైంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే బెటర్ ట్రీట్మెంట్ కోసం నారాయణ హాస్పిటల్ కి తరలించారు.

హాస్పిటల్ లో చేరాక, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి బెటర్మెంట్ లేక.. మెడికల్ సపోర్ట్ కి బ్రెయిన్, బాడీ సహకరించక పోవడంతో తారకరత్న హాస్పిటల్ బెడ్ పైనే తుదిశ్వాస విడిచాడు. దాదాపు 23 రోజులుగా తారకరత్న కోలుకొని తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి నిరాశే మిగిలిందని చెప్పాలి.ఇలాంటి తరుణంలో నందమూరి ఫ్యామిలీలో తారకరత్న లేని లోటు.. అందరికన్నా ఎక్కువగా బాలకృష్ణని బాధిస్తున్న విషయం. ఎందుకంటే.. లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన నిమిషం నుండి.. నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి, దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకున్నాడు.

చివరి నిమిషంలో కూడా బాలకృష్ణ.. తారకరత్న వెన్నంటే ఉండి.. పేరుకు బాబాయ్ అయినా తండ్రిలా కేర్ తీసుకున్నాడు. కానీ.. తారకరత్నని బతికించడానికి వైద్యులు ఎంత చొరవ తీసుకున్నారో.. కొడుకును బతికించుకోవడానికి బాలయ్య కుడా అంతకన్నా ఎక్కువ తాపత్రయపడ్డాడు. అదీగాక అందరూ ముందునుండే బాలయ్య కేరింగ్ ని దగ్గరుండి చూస్తూనే ఉన్నారు.బాలయ్య ఇన్నిరోజులు అంత కష్టపడ్డాక కూడా ఇలా జరగడంతో.. బాలయ్య కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఫ్యామిలీలో ఎన్ని మనస్పర్థలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కన పెట్టి.. బాలయ్య తారకరత్న కోసం నిలబడ్డాడు.

చివరి నిమిషాల్లో కూడా వెంటనే కొడుకును చూసుకునేందుకు అందరికంటే ముందు వెళ్ళాడు. ఇదిలా ఉండగా..చిన్నప్పటి నుండి కూడా బాలకృష్ణకి తారకరత్నపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. తారకరత్న సినిమాల్లోకి రావడానికి కూడా బాలయ్యే ఓ రకంగా కారణమని విన్నాం. మరోవైపు తారకరత్నకి బాలయ్య అంటే వీరాభిమానం. ఎన్నోసార్లు ఈ విషయాన్నీ మీడియా ముఖంగా కూడా తెలిపాడు. అంతటి ప్రేమ, అభిమానాలతో కంటికి రెప్పలా కాపాడుకున్న తారకరత్న.. దూరమవ్వడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పాలి.