తండ్రిని కడసారి చూసుకుని.. గుండెలవిసేలా రోధించింన తారకరత్న కుమార్తె!

నందమూరు తారక రత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ఆదివారం బౌతిక కాయాన్ని నివాసంలోనే ఉంచనున్నారు. తారకరత్నను కడసారి చూసుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.నందమూరి తారకరత్న మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 23 రోజుల పోరాటం తర్వాత తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని బెంగళూరు ఆస్పత్రి నుంచి హైదరాబాద్ లోని నివాసానికి తరలించారు. తారకరత్న పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు అంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇంత చిన్న వయసులోనే తారకరత్న మృతి అందరినీ కలచివేస్తోంది. తారకరత్న భౌతికకాయాన్ని చూసి కుమార్తె గుండెలవిసేలా రోధించింది.

బెంగళూరు నారాయణ హృదాలయం నుంచి తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్ లోని నివాసానికి తరలించారు. తారకరత్న పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు అంతా కన్నీరుమున్నీరు అయ్యారు. తండ్రిని చివరిచూపు చూసుకుని కుమార్తె నిష్క తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తండ్రి పార్థివదేహాన్ని చూస్తూ కుమార్తె విష్క కన్నీటిపర్యంతమైంది. అక్కడున్న ఎవరూ విష్కను ఓదార్చ లేకపోయారు. ఇంత చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం అంటే అంత చిన్న విషయం కాదు. తండ్రి ఇకలేరనే వార్తను ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోయింది.తండ్రీకుమార్తెల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కుమార్తెకు వాళ్ల నాన్నే రియల్ హీరో. ఆడించినా, లాలించినా, బుజ్జగించినా ఆమెకు కచ్చితంగా తండ్రి తోడు ఉండాల్సిందే. ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి.. కన్నీరు మున్నీరవుతున్న నిష్కను చూసి కుటుంబం మొత్తం విలపించింది.

చిన్న వయసులోనే ఎవరికీ రాకూడని కష్టం నిష్కకు వచ్చిందంటూ అంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమెను ఓదార్చేందుకు వారు విఫలయత్నం చేశారు. కానీ, ఆ చిన్నారిని మాత్రం ఎవరూ ఓదార్చలేకపోయారు.ప్రస్తుతం తారకరత్న భౌతికకయాన్ని నివాసంలోనే ఉంచారు. ఆదివారం మొత్తం స్వగృహంలోనే ఉంచనున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తారకరత్నకు ఆయన తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరత్న మృతితో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవలే తారకరత్న సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా మారిన ఇలాంటి తరుణంలో కాలంచేయడం అందరినీ బాధిస్తోంది.